బ్రేక్ ఈవెన్ కి వాల్మీకి కూత‌వేటు దూరమే

గ‌ద్ద‌ల కొండ ఐదు రోజుల వ‌సూళ్లు

వ‌రుణ్‌ తేజ్ న‌టించిన వాల్మీకి అలియాస్ గ‌ద్ద‌ల‌కొండ గణేష్  5 రోజుల షేర్ వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి. నైజాం 5.90కోట్లు, నెల్లూరు 67ల‌క్ష‌లు, కృష్ణా 1.22 కోట్లు, గుంటూరు 1.42 కోట్లు, వైజాగ్ 1.97 కోట్లు, తూ.గో జిల్లా 1.19కోట్లు, ప‌.గో జిల్లా 1.13కోట్లు క‌లెక్ష‌న్ ద‌క్కింది. ఏపీ 7.60కోట్లు, సీడెడ్-2.60కోట్లు, ఏపీ నైజాం 16.1కోట్లు వ‌సూలైంది. క‌ర్ణాట‌క 1కోటి, అమెరికా 87ల‌క్ష‌లు, ఇత‌ర భార‌త‌దేశం 53ల‌క్ష‌లు క‌లెక్ట‌య్యింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 18.5కోట్ల షేర్ వ‌సూలు చేసింది.

వాల్మీకి గ్రాస్ లెక్కల వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రా 10.8కోట్లు, సీడెడ్ 3.5కోట్లు, ఏపీ నైజాం క‌లుపుకుని 23.6కోట్లు క‌లెక్ట‌య్యింది. క‌ర్నాట‌క 2.2కోట్లు, అమెరికా 2.5కోట్లు, ఇత‌ర భార‌త‌దేశం 1.3కోట్లు గ్రాస్ వ‌సూలైంది. వాల్మీకి 24.25కోట్ల మేర ప్రీబిజినెస్ చేసింది. ఆ మేర‌కు షేర్ వ‌సూళ్లు ద‌క్కించుకోవ‌డానికి ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని క‌లెక్ష‌న్స్ డీసెంట్ గా ఉన్నాయ‌ని ఆంధ్రా బాక్సాఫీస్ వెల్ల‌డించింది.