మెగా ఫ్యామిలీ నుంచి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తున్న వైష్ణవ్ తేజ్ ను మరోసారి బ్యాడ్ లాక్ వెంటాడుతోంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ ప్రొడక్షన్ లో ఆయన శిష్యుడు బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి చాలా కాలమయ్యింది. ఈ ఏడాది సమ్మర్ లోనే కూల్ గా రావాలని అనుకున్నారు. కానీ కరోనా దెబ్బకు ఊహించని విధంగా సినిమా విడుదల ఏడాది పాటు వాయిదా పడుతూనే ఉంది.
ఈ సినిమాను ఆ మధ్య ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు రూమర్స్ చాలనే వచ్చాయి. ఓటీటీ సంస్థలు కూడా సినిమా హక్కుల కోసం బాగానే ట్రై చేశాయి కానీ వర్కౌట్ కాలేదు. వైష్ణవ్ తేజ్ కెరీర్ మొదటి సినిమా కాబట్టి డైరెక్ట్ థియేటర్స్ లోనే రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఓటీటీలో విడుదల చేయడం కుదరలేదట. ఇక సంక్రాంతి సీజన్ లోనే సినిమాను విడుదల చేయాలని అనుకున్న నిర్మాతలు ఇప్పుడు మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
సంక్రాంతికి పెద్ద సినిమాలు చాలానే రిలీజ్ కానున్నాయి. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కూడా అప్పుడే వస్తుందని అంటున్నారు. అందుకే అలాంటి టైమ్ లో రిస్క్ చేయకూడదని మార్చ్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం సినిమాపైన అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. నీ కన్ను నీలి సముద్రం సాంగ్ తోనే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇటీవల ఆ లిరికల్ సాంగ్ 100మిలియన్స్ వ్యూవ్స్ అందుకున్న విషయం తెలిసిందే.