‘ఎఫ్2’: అమెరికా కలెక్షన్స్ అప్పుడే అంతా?

భార్యా బాధితులుగా వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌లు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో వారినే కాదు.. ఎన్నారైలనూ తెగ నవ్వించేస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వీరిద్దరూ హీరోలుగా నటించిన చిత్రం ‘ఎఫ్‌2: ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’. తమన్నా, మెహరీన్‌ హీరోయిన్స్. సంక్రాంతికి థియేటర్‌కు వచ్చిన ఈ అల్లుళ్లు వెండితెరపై తెగ హంగామా చేస్తున్నారు. భార్యల వల్ల వాళ్లు ఫ్రస్ట్రేషన్‌కు గురవుతూ ప్రేక్షకులకు ఫన్‌ పంచటం జనాలకు తెగ నచ్చేస్తోంది.

ఈ చిత్రం జనవరి 12న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. అమెరికాలో ఈ చిత్రం మూడు రోజుల్లో 1 మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది.

ఫ్యామిలీ స్ కలిసి వెళ్లే కుటుంబ కథా చిత్రాలు అందునా, కామెడీ, ఫీల్‌గుడ్‌ చిత్రాలకు ఓవర్సీస్‌లో మంచి డిమాండ్‌ ఉంటుందని మరో సారి ప్రూవ్ అయ్యింది. చాలా రోజుల తర్వాత పాత వెంకటేష్‌ను చూశామని, ఆయన కామెడీ టైమింగ్ మరోసారి ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు రుచి చూపించారని అభిమానులు అంటున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో హీరో వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ నటించగా.. రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, రఘబాబు, నాజర్, అన్నపూర్ణ, ఝాన్సీ, ప్రియదర్శి, అనసూయ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.