షాకింగ్: ఆ ఇద్ద‌రు హీరోయిన్ల‌పై లైంగిక‌ వేధింపులు

ఒకరు సౌత్ నుంచి.. మ‌రొక‌రు నార్త్ నుంచి.. ! ఇద్ద‌రు హీరోయిన్లు వేధింపుల‌కు గుర‌య్యారు. ఇందులో ఒక క‌థానాయిక .. 60 ప్ల‌స్ ఏజ్ ఉన్న స్టార్ హీరో వార‌సురాలు కాగా.. వేరొక క‌థానాయిక ఎలాంటి సినీ నేప‌థ్యం లేకుండానే టాలీవుడ్ లో అడుగు పెట్టి నాయిక‌గా.. బుల్లితెర జ‌డ్జిగా కొన‌సాగుతోంది.

ఆ ఇద్ద‌రూ ఎవ‌రు? అనేది అప్ర‌స్తుతం.. కానీ ఆక‌తాయిల నుంచి వేధింపులు ఎదుర‌య్యాయి అనేది వాస్త‌వం. ఇక ముంబైకి చెందిన స‌ద‌రు న‌ట‌వార‌సురాలిని ఎవ‌రో గుర్తు తెలియ‌ని ఆక‌తాయి నిత్యం వేధిస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ కేసును సీక్రెట్ గా పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నార‌ని తెలిసింది. అత‌డు మార్ఫింగ్ పోటోల‌తో స‌ద‌రు నాయిక‌ను వెంబ‌డించాడ‌ట‌. అత‌డి ల్యాప్ టాప్.. ఫోన్ లాక్కుని పోలీసులు ద‌ర్యాప్తు మొద‌లెట్టారు.

ఇక సౌత్ లో ఓ డైరెక్ట‌ర్ తో ఎంతో స‌న్నిహితంగా మెలిగిన ఓ అందాల మ‌ల‌యాళీ నాయికకు ర‌క‌ర‌కాల వేధింపులు ఎదురయ్యాయి. త‌న‌ని ప్రేమిస్తున్నాన‌ని ఒక వ్య‌క్తి వంచ‌నకు గురి చేశాడ‌ని ఆరోపించిన స‌ద‌రు నాయిక ఆ త‌ర్వాత పెళ్లి విష‌యంలో ప‌రాభ‌వం ఎదురైంద‌ని తెలిపింది. దాంతో పెళ్లి చేసుకునే ఆలోచ‌నే లేద‌ని అంటోంది. ఇక ఇటీవ‌లే వివాదాల్లోకి వ‌చ్చిన స‌ద‌రు నాయిక‌ను కొంద‌రు డ‌బ్బు డిమాండ్ చేయ‌డం వేధించ‌డం అనే ఆరోప‌ణ‌ల‌తో అట్టుడికింది. ప్ర‌స్తుతం ఈ భామ బుల్లితెర కార్య‌క్ర‌మాల‌తోనూ బిజీగా ఉంది. ఇంత‌కుముందు మ‌ల‌యాళీ క‌థానాయిక భావ‌న‌కు ఎదురైన ప‌రాభ‌వం ఒక‌ర‌కం అనుకుంటే ఈ ఇద్ద‌రికీ ఎదురైన అనుభ‌వాలు ఇంచుమించు అలాంటివి కాక‌పోయినా.. కాస్త‌ డిఫ‌రెంట్ అనే చెప్పాలి.