తనకు ఫలానా హీరోతో లేదా ఫలానా సంగీత దర్శకుడితో ఎఫైర్ ఉందని అంగీకరించాలంటే ఎంతో గట్స్ ఉండాలి. కానీ ఈ అమ్మడు మాత్రం అలా ఎంత మాత్రం కంగారు పడలేదు. సరికదా.. అప్పుడు ప్రేమలో ఉన్నాను.. అది నిజమే.. అలా ఉంటే తప్పేంటి? అంటూ ఎదురు ప్రశ్నించింది.
ఇంతకీ ఎవరీవిడ? అంటే .. ఆ భామ ఎవరు? అన్నది అటుంచితే.. అప్పట్లో సుచీలీక్స్ వ్యవహారంలో బాగా పాపులరైన పేరు ఇది. గాయనిగా హీరోయిన్ గా సౌత్ లో బాగా పాపులారిటీ కూడా ఉంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తో ఈ అమ్మడు సుదీర్ఘ కాలం ఎఫైర్ సాగించడం అప్పట్లో సంచలనమైంది.
ఇక సుచీలీక్స్ గొడవ తర్వాత కాస్త దూరం జరిగారు కానీ.. నిరంతరం పార్టీలు పబ్బులు క్లబ్బులు అంటూ జోరుగా షికార్లు చేస్తుండేవారు. ఇక్కడ హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఈ జంట షికార్లు హాట్ టాపిక్ గానే ఉండేది. దానిపై తెలుగు సినీమీడియా గుస్సా హీటెక్కించేసేది.
ఆ షికార్ల టైమ్ లోనే ఓ పబ్ లో ఆ ఇద్దరూ లిప్ లాక్ వేసిన ఫోటోని సుచిత్ర బయటపెట్టేసింది. ఆ తర్వాత ఆ ఇద్దరి వ్యవహారం పూర్తిగా బహిరంగం అయిపోయింది. ఇక ఆ ఎఫైర్ ఆ అమ్మడి కెరీర్ పైనా తీవ్ర ప్రభావమే చూపించినా ఆ మ్యూజిక్ డైరెక్టర్ కెరీర్ కి మాత్రం ఏమాత్రం అడ్డంకి కాలేదు. ఇంతకీ ఎవరా అమ్మడు? ఎవరా మ్యూజిక్ డైరెక్టర్ .. గెస్ హూ దే ఆర్. అంత కష్టమేమీ కాదుగా!