ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలు త్వరలో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ను విస్తరింపజేయగలవని చెప్పవచ్చు. ప్రభాస్ ఆది పురుష్ రామాయణం కథతో తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. అయితే నిర్మాత అల్లు అరవింద్ కూడా అదే తరహాలో బాలీవుడ్ నిర్మాతలతో కలిసి రామాయణం కథను మరో విధంగా తెరకెక్కించాలని అనుకుంటున్నారు.
ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించిన గీత ఆర్ట్స్ లో కూడా భారీ సినిమాను నిర్మించాలని అల్లు ఆరవింద్ చాలానే ప్లాన్ చేస్తున్నారు. కానీ సరైన కథ దొరకలేదు. ఇక ఫైనల్ గా రామాయణ బ్యాక్ డ్రాప్ లోనే పాన్ ఇండియా సినిమాను నిర్మించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఆ ప్రాజెక్ట్ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వర్క్ చేయబోతున్నట్లు సమాచారం. దాదాపు 1000కోట్లతో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రెండు భాగాలుగా సినిమాను రూపొందించాలని అనుకుంటున్నారట.
ఇక త్రివిక్రమ్ తనదైన శైలిలో స్క్రీన్ ప్లే అంధించనున్నట్లు టాక్ అయితే వస్తోంది. మాటలతో పాటు పూర్తిగా స్క్రీన్ ప్లే బాధ్యతను ఆయనే తీసుకొనున్నారట. రామాయణ కథ అందరికి తెలిసినప్పటికీ అది మహా సముద్రం లాంటిదే. మెయిన్ కాన్సెప్ట్ ఎంత మంది ఎన్ని రకాలుగా చూపించినా భావం ఒక్కటే. అలాంటి కథలో స్క్రీన్ ప్లే చాలా ముఖ్యం. అందుకే త్రివిక్రమ్ తో ఆ వర్క్ చేయిస్తున్నారట అల్లు అరవింద్. మరి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ఎలా తెరపైకి వస్తుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.