త్రివిక్రమ్ శ్రీనివాస్ ని మాటల మాంత్రికుడు అంటారు. రచయితగా కెరీర్ మొదలెట్టిన ఆయన డైరక్టర్ గా మారి స్టార్స్ డైరక్ట్ చేస్తూ ముందుకు
వెళ్తున్నారు. సినిమా హిట్ అవ్వచ్చు..ప్లాప్ కావచ్చు కానీ త్రివిక్రమ్ సినిమా అంటే ఓ క్రేజ్ మాత్రం రాకుండా పోదు.
అయితే కెరీర్ ప్రారంభంలో లైటర్ వీన్ కామెడీలతో ముందుకు వెళ్లిన ఆయన తన టోన్ మార్చి ఎమోషన్ సినిమాలు రాసారు. అయితే కొందరు అభిమానులకు ఆ రోజుల నాటి త్రివిక్రమే ముద్దు. ఆ విషయమే ఆయనతో చెప్పాలనుకుంటారు. ఈ విషయం మీడియా వారు గమనించి ఆయన దగ్గర ప్రస్తావించారు. దానికి ఆయన సూటిగా సమాధానమిచ్చారు. ఆ సమాధానంలో ఎన్నో అర్దాలు గోచరిస్తున్నాయి.
త్రివిక్రమ్ మాట్లాడుతూ… మనకు మాటలు సరిగా రాని చిన్నప్పుడు ముద్దు ముద్దుగా మాట్లాడతాం. అప్పుడది ముద్దు. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడితే, ‘ఎద్దులా ఉన్నావ్.. ఇంకా అలాగే మాట్లాడతావేం’ అని తిడతారు.
అలాగే నేను చేసిన సినిమాలు ఇప్పుడు నేను చూస్తే సిగ్గుపడే అంశాలు చాలా ఉంటాయి. ప్రారంభం రోజుల్లో చేసిన సినిమాలు వేరు..ఇప్పటి సినిమాలు వేరు. వాటితో ఇప్పటి సినిమాలను పోల్చలేం అన్నారు.
అందుకే నా సినిమాలు నేను చూసుకోను. చాలా లోపాలు కనిపిస్తాయి. అలా కనిపించకపోతే మనం ముందుకు వెళ్లలేం. మళ్లీ ఆ తప్పులు చేయకుండా చూసుకోవాలి అని తేల్చి చెప్పారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ‘అరవింద సమేత’. పూజాహెగ్డే హీరోయిన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.