Home Tollywood త్రివిక్రమ్ శర్వానందకి ఇచ్చిన మాట మరిచారా?

త్రివిక్రమ్ శర్వానందకి ఇచ్చిన మాట మరిచారా?

మాయావి ప్రామిస్ ని నిల‌బెట్టుకుంటారా?

త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్… టాలీవుడ్ లో రేర్ ట్యాలెంట్. మాట‌ల మాయావి. స్టార్ డ‌మ్ పెంచ‌గ‌లిగే స‌మ‌ర్థత ఉన్న‌ ద‌ర్శ‌కుడు. ఈయ‌న‌తో సినిమా చేయాల‌ని ప్ర‌తి స్టార్ ఎదురుచూస్తుంటారు. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా ఇందుకు మిన‌హాయింపేమీ కాదు. ఈ స్టార్ డైరెక్ట‌ర్ కొన్నేళ్ల క్రితం వెర్స‌టైల్ హీరో శ‌ర్వానంద్‌కి మాటిచ్చార‌ట‌. త‌ను హీరో అయితే అత‌నితో సినిమా చేస్తాన‌ని ప్రామిస్ చేశార‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా హీరో శ‌ర్వానంద్ తెలిపారు. శ‌ర్వానంద్ న‌టిస్తున్న తాజా చిత్రం `ర‌ణ‌రంగం` ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మాన్ని ఆదివారం కాకినాడ‌లో నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ హాజరై ట్రైల‌ర్ ని రిలీజ్ చేశారు. ఈ వేదిక‌పై త్రివిక్ర‌మ్ సాక్షిగా త‌న పాత జ్ఞాప‌కాల్ని గుర్తుచేసుకున్నారు శ‌ర్వా. త‌ను ఆర్టిస్ట్‌గా వేషాల కోసం తిరుగుతున్న సంద‌ర్భంలో త్రివిక్ర‌మ్ పేరున్న రైట‌ర్ గా ప‌నిచేస్తున్నార‌ని.. ఆ స‌మ‌యంలో ఓ సినిమాలో వేషం ఇమ్మ‌ని అడిగితే “నువ్వు హీరోగా వున్న సంద‌ర్భంలో నీతో సినిమా చేస్తాన‌ని.. ఇప్పుడే ఛాన్సివ్వ‌లేన‌ని చెప్పారు. అప్పుడు ఆయ‌న ఎందుక‌లా అన్నారో నాకు అర్థం కాలేదు. ఈ రోజు హీరోగా ఆయ‌న ముందే నిలుచుని వున్నాను“ అని శ‌ర్వా ఎమోష‌న్ అయ్యారు.

త్రివిక్ర‌మ్ మాత్రం వేదిక‌పై మాట్లాడుతూ దానిపై స‌రిగా రెస్పాండ్ కాలేదు ఎందుక‌నో. మాయావి మాట్లాడుతూ .. “ర‌ణ‌రంగం ట్రైల‌ర్ ని మ‌రోసారి చూడాల‌ని అనిపించింది. ట్రైలర్ అంత ఇంప్రెస్సివ్ గా వుంది. ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ టేకింగ్‌ ఎక్స్ ట్రార్డిన‌రీగా వుంది. రెండు పాత్ర‌ల్లో హీరో శ‌ర్వానంద్ పెర్ఫార్మెన్స్ అద్భుతం“ అంటూ స‌రిపుచ్చారు. శ‌ర్వాతో సినిమా చేస్తాన‌ని మాత్రం చెప్ప‌క‌పోవ‌డం.. త‌ను చేసిన ప్రామిస్ గురించి మ‌ర్చిపోవ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ చిత్రానికి సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. కాజ‌ల్ క‌థానాయిక‌. శ‌ర్వా గ్యాంగ్ స్ట‌ర్ లుక్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది.

- Advertisement -

Related Posts

అసలు మోక్షజ్ఞ సిద్ధంగా ఉన్నాడా.. బాలయ్య సీరియస్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ వారసులు వెండితెరపైకి ఎంట్రీ ఇస్తున్నారంటే అంచనాలు మామూలుగా ఉండవు. ఇక చాలా కాలంగా అందరి ఫోకస్ మోక్షజ్ఞ పైనే ఉంది. బాలకృష్ణ లాంటి స్టార్ హీరో నుంచి రాబోయే...

రామ్ చరణ్ – అనిల్.. అనుమానించాల్సిన విషయమే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RRR ఖ్లగ్వ ఆచార్య సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమా ల అనంతరం ఈ స్టార్ హీరో ఏ దర్శకుడితో...

అసలు పేరు అదే.. గుట్టు విప్పిన అషూ రెడ్డి

బిగ్ బాస్ షో ద్వారా అషూ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయింది. అంతకు ముందు డబ్ స్మాష్ అనే యాప్ ద్వారా వీడియోలు చేసి క్రేజ్ తెచ్చుకుంది. అలా...

ట్రోలింగ్‌కు స్ట్రాంగ్ రిప్లై.. సమంతతో అంత ఈజీ కాదు!

సమంత వ్యవహారం అంత ఈజీ కాదు. ఓ బేబీ సినిమాలో డైలాగ్‌లా.. నాతో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు అనే మాట సమంతకు ఎంత యాప్ట్ అవుతుందో.. నాపై ట్రోలింగ్ చేస్తే వ్యవహారం మామూలుగా...

Latest News