నిజమేట..నక్క తోక తొక్కినట్లే

                                                                     (సూర్యం)

సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ సినిమాలతో హిట్లు కొట్టిన దర్శకుడు త్రినాథ‌రావు న‌క్కిన‌. ఆయన తాజాగా రామ్‌తో తెర‌కెక్కించిన ‘హ‌లో గురు ప్రేమ కోస‌మే’ హిట్ కాకపోయినా జస్ట్ ఓకే అనిపించుకుంది. అయితే ఓపినింగ్స్ బాగుండటం, కలెక్షన్స్ ఫరవాలేదనిపించుకోవంటతో ఆయన ఊపిరి పీల్చుకుని తన తదుపరి చిత్రంకు ప్లాన్ చేసుకుంటున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సారి త్రినాధరావు సీనియర్ హీరోతో తన నెక్ట్స్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఆ హీరో మరెవరో కాదు వెంకటేష్ అని తెలుస్తోంది. వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గ కథతో నక్కిన ఎప్రోచ్ అయ్యి సురేష్ బాబుని ఒప్పించాడని సమాచారం. నువ్వు నాకు నచ్చావ్ షేడ్స్ ని హలో గురు ప్రేమ కోసమే లో ఇరికించిన ఆయన వెంకటేష్ ని తన సినిమాతో ఇంప్రెస్ చేసాడంటున్నారు.

చక్కటి ఫ్యామిలీ సినిమాగా వెంకీ మెచ్చుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ సారి కూడా మామా, అల్లుడు కథతో చేస్తాడా అంటే వెంకీ ఇమేజ్ కు వయస్సుకు అది కష్టమే. కాబట్టి రూట్ మార్చి యాక్షన్,కామెడీతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో హిట్ కొడితే…ఇక నక్కిన పెద్ద హీరోల దృష్టిలో పడే అవకాసం ఉంది. దాంతో ఈ ఆఫర్ నక్కినకు నక్క తోక తొక్కినట్లే అని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

ఇక ఈ సినిమాని కిర‌ణ్ రెడ్డి, భ‌ర‌త్ చౌద‌రి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. డి.సురేష్ బాబు పార్టనర్ గా ఉంటార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నులు ప్రారంభమయ్యాయి.  సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ చిత్రాల‌కు కథ, మాట‌లు అందించిన ప్ర‌స‌న్న కుమార్ దీనికి క‌థ కూడా ఇచ్చార‌ని తెలుస్తోంది. ‘ఎఫ్ 2’షూటింగ్ తో బిజీగా ఉన్న వెంక‌టేష్‌.. ఆ సినిమా పూర్త‌య్యాక దీన్ని ప‌ట్టాలెక్కిస్తార‌ని తెలుస్తోంది.