టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఏఏ19 సెట్స్ లో కో డైరెక్టర్ తో గొడవ పడిన సంగతి తెలిసిందే. షూటింగ్ క్యాన్సిల్ అన్న విషయాన్ని చివరి నిమిషంలో చెప్పిన సదరు కోడైరెక్టర్ తో బన్ని గొడవపడ్డారని ఆ వివాదం కాస్తా దర్శక సంఘం వరకూ వెళ్లబోతే త్రివిక్రమ్ – అరవింద్ ద్వయం కూల్ చేశారని వార్తలొచ్చాయి. అయితే ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసిపోలేదని తాజాగా తెలుస్తోంది.
దానికి కొనసాగింపు ఎపిసోడ్ లో కొన్ని ఆసక్తికర సంగతులు తాజాగా మీడియాలో చర్చకొచ్చాయి. కోడైరెక్టర్ పై బన్ని ఫైరింగ్ పై టాలీవుడ్ మీడియా నెగెటివ్ గా ప్రచారం చేసింది. దాంతో దానికి కవర్ చేయలేక బన్ని మేనేజర్ చాలానే తంటాలు పడుతున్నాడట. అబ్బే అది బన్నీ తప్పు కాదు. అతడి కోపం వెనక లాజిక్ ఉంది! అంటూ ఓ నిజాన్ని అతడు బయటికి లీక్ చేశాడు.
నిజానికి అమెరికాలో తన స్నేహితుడు రానాకి కిడ్నీ ఆపరేషన్ చేసేప్పుడు తనతో పాటే అక్కడ బన్ని ఉండాలని అనుకున్నాడు. అయితే షూటింగ్ ఉందని చెప్పడంతో అమెరికా ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. అదే ఆరోజు ఫైరింగ్ కి కారణం. ఎంతో ఇంపార్టెంట్ పని వదులుకుంటే ఇలా చేస్తారా? అంటూ బన్ని సీరియస్ అయ్యారట. ఆ మేరకు బన్ని మేనేజర్ ఇచ్చిన లీకు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో రానా కిడ్నీ ఆపరేషన్ వ్యవహారం బయటకు లీకవ్వడంతో డి.సురేష్ బాబు సీరియస్ అయ్యారట. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకున్న తనకు బన్ని మేనేజర్ ఇచ్చిన స్ట్రోక్ కి షాక్ కి గురై అతడిని తీవ్రంగానే తిట్టేశారట. ప్రస్తుతం ఈ సంగతి ఫిలింమీడియాలో వైరల్ గా చర్చకొచ్చింది.