అరుదైన రోగంతో బాధ‌ప‌డుతున్న టాప్ హీరోయిన్

బొమ్మాళీ వెంటాడుతోందా?

`ఆషిఖి 2` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది మొద‌లు ఎదురే లేని కెరీర్ ని సాగిస్తోంది శ్ర‌ద్ధా క‌పూర్. `స్త్రీ` అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో న‌టిగా మ‌రో మెట్టు ఎక్కింది. ఇటీవ‌లే సాహో, చిచ్చోర్ లాంటి విల‌క్ష‌ణ‌మైన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో అభిమానుల ముందుకు వ‌చ్చింది. ఇవి రెండూ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న‌విజ‌యం సాధించాయి. కేవ‌లం వారం గ్యాప్ లోనే వ‌చ్చిన ఈ రెండు చిత్రాలు హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్లు కొట్టాయి. త‌దుప‌రి స్ట్రీట్ డ్యాన్స‌ర్ 3డి చిత్రంతో పాటు ప‌లు భారీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.

అదే టాప్ సీక్రెట్

అయితే ఎవ‌రూ ఊహించ‌ని ఓ షాకింగ్ మ్యాట‌ర్ ని తాజాగా శ్ర‌ద్ధా క‌పూర్ రివీల్ చేసింది. ఇది త‌న ఆరోగ్యానికి సంబంధించిన టాప్ సీక్రెట్ కావ‌డంతో అభిమానుల‌కు ఇది షాకింగ్ గానే ఉంది. ఓ ఇంట‌ర్వ్యూలో శ్ర‌ద్ధా మాట్లాడుతూ..“నాకు ఓ అరుదైన స‌మ‌స్య ఉంది. అది వైద్యానికి అంద‌ని పెయిన్. అది ఎందుకు వ‌స్తుందో నాకు తెలీనే తెలీదు. ఆషిఖి 2 రిలీజ్ త‌ర్వాత నుంచి ఈ స‌మ‌స్య న‌న్ను వెంటాడుతోంది“ అని చెప్పి పెద్ద షాక్ నిచ్చింది. అస‌లు డ‌యాగ్నోసిస్ అన్న‌దే లేని రుగ్మ‌త ఇది.  ఫిజిక‌ల్ గా ఎక్క‌డుందో కూడా గుర్తు ప‌ట్ట‌లేని నొప్పిని భ‌రించాను. ఎప్పుడు టెస్టులు చేసినా అది బ‌య‌ట‌ప‌డేది కాదు.. అని తెలిపింది. అస‌లు అది యాంగ్జైటీనా? అన్న‌ది కూడా తెలియ‌లేద‌ని చెప్పింది ఈ బ్యూటీ.

ఆ పెయిన్ భ‌రించ‌లేనిది

అయితే ఇన్నాళ్లుగా వేధించిన ఆ స‌మ‌స్య‌ను ఏదోలా ఇటీవ‌లే క‌నిపెట్టింద‌ట‌. ఇప్ప‌టికి దానిని ఎలా ఎదురించాలి? అన్న‌ది తెలుసుకున్నాన‌ని తెలిపింది. న‌న్ను నేను ప్రేమించుకోవ‌డం ద్వారా ఇలాంటి వాటిని ఎదురించ‌గ‌లం అని తెలుసుకున్నా. ఎక్క‌డో ఓ చోట బాధ త‌ప్ప‌దు. ఎదుర్కోవాల్సిందే. వింతగా.. కొత్త‌గా నాలో నేనే న‌లిగిపోవాలి. నాలో ఆ పెయిన్ ఒక భాగం అని అంగీక‌రించాల్సిందే. దానిని ప్రేమ‌తో భ‌రించాల్సిందే.. అని శ్ర‌ద్ధా ఎంతో వేదాంత ధోర‌ణితో మాట్లాడింది. అస‌లు మ‌నం ఎవ‌రు? మ‌న త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం ఏమిటి? అన్న‌ది తెలుసుకుని ముందుకెళితే చాలు. ఇలాంటి వాటిని ఎదురించ‌గ‌లం అని తెలిపింది. అన్న‌ట్టు సాహో సినిమా చేస్తూనే వ‌రుస‌గా మూడు సినిమాల్లో న‌టించిన శ్ర‌ద్ధా ఎందుక‌నో రెస్ట్ లెస్ గా క‌నిపించింది. బ‌హుశా త‌న‌ని వేధించే ఆ బొమ్మాళీ తీవ్ర‌మైన ఒత్తిడి అయ్యి ఉండొచ్చేమో! న‌టుడు శ‌క్తి క‌పూర్ – న‌టి శివంగి క‌పూర్ జంట గారాల‌ కుమార్తె  శ్ర‌ద్ధా క‌పూర్ అన్న సంగ‌తి తెలిసిందే.