నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసిన టాప్ 10 జాబితా

                         మ‌స్ట్ వాచ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.. తెలుగులో ఆద‌ర‌ణ ఎంత‌?

నెట్ ఫ్లిక్స్ లో అత్య‌ధిక ఆద‌ర‌ణ పొందిన థ్రిల్ల‌ర్ సిరీస్ ల‌ తాజా జాబితా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో హాలీవుడ్ స్టార్ క్రిస్ హేమ్స్ వ‌ర్త్.. బాలీవుడ్ న‌టుడు ర‌ణ‌దీప్ హుడా క‌లిసి న‌టించిన `ఎక్స్‌ట్రాక్ష‌న్` 9 కోట్ల 90 ల‌క్ష‌ల వ్యూవ‌ర్స్ తో టాప్ వ‌న్ లో నిలిచింది. ర‌స్పో బ్ర‌ద‌ర్స్ రూపొందించిన చిత్ర‌మిది.

ఎక్స్‌ట్రాక్ష‌న్ .. 2020 బెస్ట్ స్ట్రీమింగ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ. ఈ సినిమా క‌థాంశం ఆసక్తిక‌రం. మాదకద్రవ్యాల డాన్ కిడ్నాప్ కు గురైన త‌న కొడుకును రక్షించడానికి బంగ్లాదేశ్‌లోకి క‌థానాయ‌కుడిని పంపిన త‌ర్వాత ఏం జ‌రిగింది? అన్న‌దే క‌థాంశం. క‌రుడుగ‌ట్టిన కిరాయి సైనికుడు అయిన క‌థానాయ‌కుడు బంగ్లా దేశ్ లో మనుగడ కోసం ఎలాంటి శోధ‌న జ‌రిపాడు? అన్నది ఆస‌క్తిక‌రం. క్రిస్ హేమ్స్‌వర్త్, రుద్రక్ జైస్వాల్, రణదీప్ హుడా త‌దిత‌రులు న‌టంచారు. హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో అందుబాటులో ఉంది.

నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసిన టాప్ ఓటీటీ మూవీస్ పూర్తి జాబితా ఇది:

*ఎక్స్‌ట్రాక్ష‌న్ 99 మిలియన్
* బర్డ్ బాక్స్ 89 మిలియన్
* స్పెన్సర్ కాన్ఫిడెన్షియ‌ల్ 85 మిలియన్
* 6 అండ‌ర్ గ్రౌండ్ 83 మిలియన్లు
* మర్డర్ మిస్టరీ 73 మిలియన్లు
* ది ఐరిష్ మ్యాన్ 64 మిలియన్లు
* ట్రిపుల్ ఫ్రాంటియర్ 63 మిలియన్లు
* ది రాంగ్ మిస్సీ 59 మిలియన్
* ది ప్లాట్ ఫామ్ 56 మిలియన్లు
* ది ప‌ర్ఫెక్ట్ డేట్ 48 మిలియన్లు