టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత మరో స్పెషల్ ఈవెంట్ హాట్ టాపిక్ గా మారింది. అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు తన 50వ పుట్టినరోజు వేడుకను చాలా రిచ్ గా ప్లాన్ చేశారు. గురువారం రాత్రి ఇండస్ట్రీలోని అగ్ర హీరోలు హీరోయిన్స్ ను స్పెషల్ గా పిలిచి పార్టీ ఇచ్చారు. పెళ్లి తరువాత కూడా రిసెప్షన్ పార్టీ ఇవ్వలేదు కాబట్టి దిల్ రాజు ఈ వేడుకలోనే దాన్ని కూడా మిక్స్ చేసేశాడు. అందుకే అంత రిచ్ గా మారింది.
మన స్టార్ హీరోలు కూడా అంతా కలిసి కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆ కిక్కే వేరు. వేడుకకు మెగాస్టార్ పవర్ స్టార్ సూపర్ స్టార్ రెబల్ స్టార్ అలాగే రౌడి స్టార్ ఇంకా చాలా మంది యువ హీరోలు కూడా వచ్చారు. అయితే ప్రతి ఫొటో వైరల్ అవ్వగా మెయిన్ గా దిల్ రాజు కపుల్స్ తో మన హీరోలు కొందరు స్టైలిష్ గా స్టిల్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, రామ్ చరణ్, మహేష్, ప్రభాస్, నాగ చైతన్య అంతా ఒకే ఫ్రేమ్ లో కనిపించారు.
ముఖ్యంగా మహేష్ పక్కనే ప్రభాస్ చాలా సింపుల్ గా స్టిల్ ఇవ్వడం అభిమానులకు మంచి కిక్కిస్తోంది. వయసును విషయం పక్కనపెడితే ఫొటోలో ఉన్న అందరూ హీరోలు కూడా ఒకే ఏజ్ లో ఉన్న వారిలా కనిపిస్తున్నారు. దానికి తోడు దిల్ రాజు కూడా యువకుడిలానే స్టైలిష్ గా రెడీ అవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.