టాలీవుడ్ లో టాప్ స్టార్ ఎవరో తెలుసా ?

టాలీవుడ్ లో టాప్ స్టార్ అనగానే ఎవరైనా మహేష్ బాబు అని చెబుతారు . కానీ ప్రభాస్ చెప్పింది వింటే షాక్ తినాల్చిందే. కాఫీ విత్  కరణ్ షోలో ప్రభాస్ , రాజమౌళి , రానా పాల్గొన్నారు . రకరకాల ప్రశ్నలు అడిగిన తరువాత  కరణ్  ప్రభాస్ ను ఓ ప్రశ్న అడిగాడు .

“తెలుగు తెర మీద హీరోలకు మీరు ఇచ్చే ర్యాకులు ఏమిటి ” అని అడిగాడు. తెర  మీద  అని కరణ్  మరోసారి స్పష్టం చేశాడు. “జూనియర్ ఎన్టీఆర్, మహేష్ , బన్నీ , రామ్ చరణ్ ” అని ప్రభాస్  వారి మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని చెప్పాడు. “జూనియర్ అంటే …? “తారక్ ” చెప్పాడు ప్రభాస్ .

ప్రభాస్ చెప్పినదాన్ని బట్టి తారక్  నంబర్ వన్ ప్లేసులో వున్నాడు . ఆతరువాతనే మహేష్, మూడవ స్థానంలో బన్నీ, నాలగవ స్థానంలో రామ్ చరణ్. అయితే మరి ప్రభాస్ ఏ స్థానంలో ఉన్నట్టు ? ఇది ఎవరు చెప్పాలి ?