ఆమె టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. దర్శకులతో మంచి పరిచయాలున్నాయి. నిర్మాతలతో అంతకు మంచిన సాన్నిహిత్యం అమ్మడి సొంతం. సొగసిరి సీటీ కొడితే! ఠక్కునంతా ముందు వాలాల్సిందే. సిటీలో బయటకు వెళ్లాలంటే గుమ్మం ముందుకి ఆడి రావాలి. ఆ వెనుక భద్రతకు సంబంధించిన మరో కారు ఒకటి వెంట వెళ్లాలి. చిటికేయగానే సిబ్బంది ముందు వాలిపోవాలి. అక్కడ తేడా జరిగితే తప్పు చేసిన వాడి గూబ గీయిమనిపించాలి. ఆ దెబ్బకి అమ్మడు ఈగో సాటిస్పై అవ్వాలి. అదీ ఆ ముద్దుగుమ్మ రేంజ్. హాట్ హాట్ డ్రెస్సింగ్ సెన్స్ తోనూ పిచ్చెక్కించడం అమ్మడిలో మరో స్పెషాలిటీ.
మరి ఇంత వగలు..సెగలు పోయే అమ్మడు చేయకూడని ఓ తప్పు చేసేసిందా? జారని చోట కాలు జారిందా? అంటే అవుననే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాక్ డౌన్ కి ముందు ఆ భామ హైదరాబాద్ లోని ఓ హీరో పబ్ కి స్నేహితులతో కలిసి వెళ్లిందిట. అకేషన్ ఎవరిది? అన్నది తెలియదుగానీ ! స్నేహితులతో కలిసి ఫుల్ గా మద్యం సేవించిందిట. సాయంత్రం ఖాళీ కడుపుతో పబ్ కి వెళ్లడంతో వెళ్లి వెళ్లగానే రెండు బీరులు లబక్కన ఎత్తేసింది. ఆపై స్నేహితులతో మాట మంతి జరిపిందిట. ఆ సమయంలో ఐదారుగురు ఉన్నట్లు సమాచారం. అందులో ఓ స్నేహితురాలి ఫ్యామిలీ ప్రెండ్ కూడా నట.
ఈ గ్యాంగ్ అంతా కలిసి కొన్ని గంటలు పాటు ఆ పబ్లో మత్తులో తేలారుట. అయితే ఆ హీరోయిన్ మోతాదుకి మంచి సేవించడంతో సరిగ్గా 11 గంటల సమయంలో కడుపులో తేడా కొట్టిందిట. దీంతో వాష్ రూమ్ లో అతిగా ఉన్నదాన్ని బయటకు పంపించే ప్రయత్నం చేసిందిట. ఆ సమయంలోనే బాత్ రూమ్ లో కాలు జారిందిట. ఆ కారణంగా కాలి వేళ్లు రెండు విరిగినట్లు తెలిసింది. దీంతో అమ్మడిని తన స్నేహితురాలు ఒకరు వెంటనే తెలిసిన డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లిందిట. ప్రస్తుతం ఆ రెండు వేళ్లకు డాక్టర్ కట్లు వేసాడుట. ఆ కట్లు వేయించుకున్న హీరోయిన్ ఎవరు? అన్నది అతి త్వరలోనే రివీల్ అవుతుంది.