ఇంతకీ వారసులు ఎక్కడున్నారు?
క్లాసిక్ డేస్ .. క్లాసిక్ స్టార్స్ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. కాంతారావు, రాజనాల, ముక్కామల, ఎస్వీ రంగారావు, ఘంటసాల, రేలంగి నరసింహారావు, నాగభూషణం .. ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు! అయితే వీళ్లందరి వారసులు ఎక్కడ? ఏం చేస్తున్నారు అంటే.. ఏమో ఎవరు ఎక్కడున్నారో. అయితే వీళ్లలో ఎవరు ఎక్కడ ఉన్నా కానీ, పైన చెప్పిన పేర్లలో వారి ఆస్తులన్నీ కరిగిపోయాయన్నది ఇండస్ట్రీలో మాట్లాడుకునే మాట. ఇంతకీ ఆ ఆస్తులు కరగదీసినది ఎవరు? అని ఆ అందరి చరిత్ర తెలిసిన సీనియర్ ఆర్టిస్టు చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాల్ని చెప్పారు.
సదరు సీనియర్ తారలంతా రెండు మూడు కాల్షీట్లతో బిజీగా ఉండే ఆర్టిస్టులే ఆ రోజుల్లో. బోలెడంత సంపాదించారు. కానీ మా రోజుల్లోనే వాళ్ల గురించి బోలెడన్ని చెప్పుకునేవారు. ఆస్తులు కోల్పోయారని, తాగి నాశనమయ్యారని, కొందరైతే వ్యసనాల పాలయ్యారని చెప్పుకునేవారు. ఘంటసాల ఓ సినిమా తీశారు.. దాంతో ఆయన నాశనం అయ్యారని చెప్పుకున్నారు. దాని కాంపన్సేషన్ కోసం ఇంకో సినిమా తీసి ఇంకా నాశనమయ్యారని చెప్పుకున్నారు. ఇక హరనాథ్ తాగి నాశనం అయ్యాడని, అది చూసి రామకృష్ణ జాగ్రత్త పడ్డారని అప్పట్లో చెప్పుకునేవారు అని చంద్రమోన్ వెల్లడించారు.
ప్రభుత్వోద్యోగులే బెస్ట్:
ఇది గ్యారెంటీ లేని ప్రొఫెషన్. ఇక్కడ జాగ్రత్త ఇంపార్టెంట్ అని తెలిసింది. వాస్తవానికి నా స్నేహితుల్లో వారానికి రెండ్రోజులే డ్యూటీ చేసే ప్రభుత్వోద్యోగులు నెలకు 60వేలు అకౌంట్లో పడేవాళ్లు అయిన వాళ్లున్నారు. ఓ రకంగా వాళ్లు ఏ పని లేకుండానే సంపాదించారు. మేం ప్రతిరోజూ కష్టపడితేనే వచ్చింది ఆస్తి. గవర్నమెంట్ ఉద్యోగులకు మినిమం 60వేలు గ్యారెంటీ ఉంది అప్పట్లోనే. ఇక నా సంపాదన గురించి మాట్లాడితే.. నేను సంపాదించినది ఇప్పటికీ సంపాదించి పెడుతోంది. అందువల్ల నేను సేఫ్‌గా ఉన్నాను. నా వరకూ మినిమం రక్షణ ఉండాలని ప్లాన్ చేసుకున్నాను. ఇల్లు, స్థలాలు.. బ్యాంకులో సొమ్ము దాచుకోవడాలు… అద్దెలు వగైరా జాగ్రత్తతోనే వచ్చినవి.
తాగి హ్యాబిట్స్ తో నాశనమైన హీరో:
ఇండస్ట్రీ అవకాశం ఇచ్చినా.. తాగి, ముం…లకు తిరిగి.. సెకండ్ మ్యారేజ్.. చేసుకుని ఇలా నాశనమైన వాళ్లే ఎక్కువ. నాగభూషణం ఎంతటి వాడు.. ఆయన ఆస్తుల గురించి నాకు తెలుసు. హైదరాబాద్- గాంధీనగర్‌లో ఓ ఇల్లు తప్ప మొత్తం పోగొట్టుకున్నాడు. పిల్లల్ని కార్‌లో పంపించి గోల్డ్ స్పూన్‌తో పంపడం వల్ల దెబ్బ తిన్నవాళ్లే ఎక్కువ. కష్టం విలువ తెలియజెప్పకపోవడం వల్లనే ఈ ముప్పు. రాజనాథ్, హరనాథ్ పిల్లలు అంతే. రంగారావు కొడుకు అంతే.. నాన్న వదిలేసిన గ్లాస్‌లో మందు తాగే వారసులున్నారు. అందుకే ఆర్టిస్టులు లైమ్ లైట్‌లో ఉన్నప్పుడు జాగ్రత్తపడాలి.. అంటూ ఇలా ఎన్నో విషయాల్ని చంద్రమోహన్ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.