బిగ్‌బాస్ బ్యూటీ తేజస్వీ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిత్యం హాట్ హాట్ ఫోటోలతో నానా రచ్చ చేస్తూ ఉంటుంది. అసలే ఈ భామకు ప్రయాణాలు, బీచ్‌లు, బికినీలతో అందాల ఆరబోత అంటే చాలా ఇష్టం. బిగ్ బాస్ షో తరువాత అవకాశాలు తగ్గినా గానీ అందాల ఆరబోతతో అలా నెట్టుకొట్టేస్తుంది. బిగ్ బాస్ హౌస్ సెకండ్ సీజన్‌లో ఈ భామ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అప్పటి వరకు ఉన్న పాజిటివ్ ఇమేజ్ పూర్తిగా కోల్పోయింది.
బిగ్ బాస్ హౌస్‌లో కౌశల్‌తో నిత్యం గొడవలు పడటంతో ఈమెకు బాగా నెగెటివిటీ పెరిగింది. అలా చేయడంతో మధ్యలోనే ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అయితే బయటకు వచ్చాక కూడా ఆ నెగెటివిటీ తగ్గలేదు. ఆ ఇమేజ్ వల్లే లాఫ్టర్ షో అనే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం ఫెయిల్ అయింది. ఇక అటు వెండితెరపై, బుల్లితెరపై ఆఫర్స్ లేకపోవడంతో వెబ్ సెరీస్, ఓటీటీలు అంటూ బోల్డ్ కంటెంట్‌కు ఓకే చెప్పడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే కమిట్‌మెంట్ అనే వెబ్ సిరీస్‌ను చేస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో తేజస్వీ చేసే రచ్చకు నెటిజన్లకు పిచ్చెక్కిపోతోంది. అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటూ.. వారితో ముచ్చటిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఫాలోవర్స్‌ను ఫిదా చేసేస్తోంది. లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ వస్తోన్న తేజస్వీ కొన్నింటిని మిస్ అవుతున్నానని బాధపడుతోంది. సూర్యుడిని మిస్ అవుతున్నానని, ప్రయాణాలు చేయడం, ఇంకా ఎన్నెన్నో మిస్ అవుతున్నాని అప్పట్లో ఎప్పుడో బీచ్‌లో బికినీ ధరించి ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను
షేర్ చేసింది.