విదేశాల్లో ఆ ముగ్గురు హీరోలు

పెద్ద హీరోలు తమ చిత్రాల షూటింగ్ విదేశాల్లో జపాలని అనుకుంటారు . సుందరమైన లొకేషన్లు , అందమైన భామలతో విహరిస్తుంటే.. ప్రేక్షకులు మైమరచి పోతారని, అభిమానులు ఖుషీగా ఉంటారని భావిస్తారు . గతంలో పాటలను చిత్రించడానికి వెళ్లేవారు . అయితే ఇప్పుడు పాటలతో పాటు ముఖ్యమైన సన్నివేశాలు కూడా విదేశాల్లో చిత్రీకరిస్తున్నారు .

ఇప్పుడు తెలుగు హీరోలు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ ముగ్గురు తమ షూటింగ్లను విదేశాల్లో జరుపుకోవడం విశేషం . చిరంజీవి తమ స్వంత సినిమా” సైరా నరసింహారెడ్డి “సినిమాలోని యుద్ధ సన్నివేశాలు జార్జియాలో తీస్తున్నారు . సైరా నరసింహారెడ్డి చారిత్రక సినిమా . ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రాయల సీమలోని కర్నూల్ దగ్గర కోయిలకుంట్ల చెందిన వాడు , బ్రిటిష్ వారికి వుయ్యాలవాడకు మధ్య భరణం విషయమై తలెత్తిన తగాదా చిలికి చిలికి గాలివానగా మారుతుంది . వారి కొలువులో వున్న తహసీల్దారును ఉయ్యాలవాడ చంపడంతో బ్రిటిష్ వారు వుయ్యాలవాడను వెంటాడి ,వేటాడి 1846లో పెట్టోకొని 1847, 22 ఫిబ్రవరీన వురి తీసి చంపుతారు .

బ్రిటిషువారికి, నరసింహారెడ్డికి మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలకు జార్జియా అనుకూలమైనది అని నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేంద్ర రెడ్డి భావించడంతో అక్కడ గత కొన్నాళ్లుగా యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు . ప్రస్తుతం చిరంజీవి జార్జియాలోని వున్నాడు . ఈ చిత్రాలతో అమితాబ్ బచ్చన్ , నయన తార , జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు .

మహేష్ బాబు పూజా హెగ్దే జంటగా నిర్మిస్తున్న “మహర్షి ” చిత్రం షూటింగ్ కోసం యూనిట్ అమెరికా బయలుదేరుతుంది . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు . ఈ చిత్రంలోని పాటలతో పాటు కొన్ని ముఖ్య సన్నివేశాలను కూడా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది . అందుకోసం దర్శకుడు వంశీ అమెరికాల పర్యటించి లొకేషన్లు ఎంపిక చేశారట . ఈ చిత్రంలో మహేష్ బాబు మహర్షి అనే ఓ విభిన్న పాత్రలో నటిస్తున్నాడు . అత్యంత భారీగా నిర్మిస్తున్నారు . ఇద్దరు అగ్ర నిర్మాతలు అశ్విని దత్ , దిల్ రాజు మహేష్ తో చిత్రాన్ని నిర్మిస్తున్నారు .

ఇక ప్రభాస్ , పూజ హెగ్దే జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్ ఇటలీలో జరుగుతుంది . ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ , గోపి కృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి . రాధాకృష్ణ దర్శకుడు . ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదు . ఇది రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని చెబుతున్నారు .  

ప్రభాస్, పూజా మీద రెండు పాటలతో పాటు కొన్ని సన్నివేశాలు కూడా ఇటలీలో తీయడానికి ప్లాన్ చేశారట . బాహుబలి తరువాత ప్రభాస్ మార్కెట్ బాగా పెరిగింది . అందుకే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ , హిందీ భాషల్లో విడుదల చెయ్యాలను కుంటున్నారు .