ముద్దులు పెట్టనంది… మూడు సినిమాలు వదిలేసుకుంది!

ప్రజెంట్ సినిమాల్లో లిప్ కిస్సులు, బికినీలు సర్వ సాధారణమే. ఇప్పటి హీరోయిన్లలో కొందరు, హీరోయిన్‌ అవకాశాల కోసం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిల్లో ఎక్కువశాతం మంది లిప్ కిస్సులకు, బికినీలకు సిద్ధపడే వస్తున్నారు. గ్లామర్‌కి ‘యస్’ అంటున్నారు. అదే సమయంలో ‘నో’ చెప్పే అమ్మాయిలు కూడా వున్నారనుకోండి. అందులో ‘ప్రేమమ్’ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ ఒకరు.

 

మలయాళ హిట్ సినిమా ‘ప్రేమమ్’తో ఈ అమ్మాయికి మంచి గుర్తింపు లభించింది. తర్వాత తెలుగు రీమేక్ నాగచైతన్య ‘ప్రేమమ్’లోనూ అదే పాత్రలో నటించింది. తర్వాత తెలుగులో నటించలేదు గానీ… తమిళంలో విజయ్ సేతుపతితో మూడు సినిమాల్లోనూ, ఓ మలయాళ సినిమాలోనూ నటించింది. అయితే.. మడోన్నా నటించిన సినిమాలను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. లిప్ కిస్సులకు నో చెప్పడం వల్ల, కమర్షియల్ హీరోయిన్ల తరహాలో కనిపించలేనని చెప్పడం వల్ల అవకాశాలు వెనక్కి వెళ్లాయని మడోన్నా తెలిపింది.

 

“లిప్‌లాక్ సీన్లలో నటించడం నా వల్ల కాదు. మూతిముద్దులు పెట్టనని చెప్పినందుకు మూడు సినిమాల్లో నటించే అవకాశాన్ని కోల్పోయా. నాకు సిగ్గు ఎక్కువ. హీరోలను కౌగిలించుకోవడం కూడా ఇబ్బందిగా వుంటుంది” అని మడోన్నా సెబాస్టియన్ పేర్కొంది.