హిట్ వచ్చినా కుర్రోడిని గుర్తించరేం.!

‘సామజవరగమన’ సినిమాతో శ్రీ విష్ణు మంచి హిట్ కొట్టాడు రీసెంట్‌గా. ఎందుకో తెలీదు కానీ, ఇంత మంచి టాక్ వచ్చినా ఈ సినిమాతో శ్రీ విష్ణు స్టార్‌డమ్ అయితే పెరగలేదు.

సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయ్. అయితే సినిమాకి సరిపడా పబ్లిసిటీ రావడం లేదు. ఇందుకు కారణం పీఆర్ టీమ్ యాక్టివ్‌గా లేకపోవడమేనా.? లేక వేరే ఏదైనా కారణముందా.? తెలియ రావడం లేదు.

కావాలనే శ్రీ విష్ణు పేరు బయటికి రాకుండా చేస్తున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయ్ ఇన్‌సైడ్‌లో. శ్రీ విష్ణు మంచి నటుడు. ఆయన యాక్టింగ్ టాలెంట్ గురించి గతంలోనే పలు సినిమాల్లో చూశాం.

సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా వుంది శ్రీ విష్ణు సినిమాలకు. అలాంటిది ఇంత పాజిటివ్ టాక్ వచ్చినా ‘సామజవరగమన’ ఎందుకు టాక్‌లోకి రావడం లేదు.? నిజంగానే శ్రీ విష్ణుని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా.? తెర వెనక ఏదో జరుగుతోందన్న గాసిప్స్ వినిపిస్తున్నాయ్. చూడాలి మరి.