సినిమాలు చేయకుండా ఖాళీగా కూర్చున్న ఓ సినీ ప్రముఖుడు సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడుతూ సగటు సినీ అభిమానితో చీవాట్లు తింటున్నాడు.
యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూల పేరు చెప్పి మరింత ఇరిటేట్ చేస్తున్నాడు. ఏం చేసినా అతన్ని పట్టించుకోవడం లేదని, సినీమాలూ, రాజకీయాలూ అన్నీ మాట్లాడేసి పరువు తీసుకుంటున్నాడు. టైమ్ బ్యాడ్ అంటూ సన్నిహితుల వద్ద గుక్క పట్టి ఏడుస్తాడు కానీ, పద్ధతి మాత్రం మార్చుకోకపోవడం ఆ పెద్ద మనిషికి అలవాటుగా మారిపోయింది.
ఒకప్పుడు మంచి సినిమాలు చేసి, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న ఈ పెద్ద మనిషి, ఇప్పుడు ఈగోలకు పోయి అనవసరంగా తన పెద్దరికాన్ని చెడగొట్టుకుంటున్నాడని ఇతర సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
సినిమాలు చేయకపోతే చేయకపోయాడు,లేటు వయసులో కృష్ణా.. రామా అంటూ ఇంట్లో కూర్చోక, అనవసరంగా నోరు పారేసుకుంటూ రచ్చకెక్కడమెందుకు.?