యంగ్ రెబల్ స్టార్ స్టార్ ప్రభాస్ నుంచి ఇప్పుడు ప్రపంచ స్థాయి రిలీజ్ చిత్రాలు అయితే రెండు ఉన్నాయి. మొదటిది బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “ఆదిపురుష్” ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ కాబోతుండగా దీని కన్నా ముందే వరల్డ్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేసిన చిత్రం “ప్రాజెక్ట్ కె”.
యంగ్ దర్శకుడు నాగశ్విన్ మరియు ప్రముఖ నిర్మాత సి అశ్వనీదత్ ల కాంబోలో ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయి సినిమాగా అనౌన్స్ చేశారు. అయితే ఈ భారీ సినిమా ఇప్పుడు హైదరాబాద్ లో భారీ స్థాయి సెట్టింగ్స్ లో బాలీవుడ్ స్టార్స్ తో షూటింగ్ జరుపుకుంటుంది.
అయితే ఈ సినిమాపై ఓ గ్లింప్స్ ని అయితే తాను చూసినట్టుగా ఓ యంగ్ హీరో చెప్పడం ఆసక్తిగా మారింది. మరి ఆ యంగ్ హీరో మరెవరో కాదు మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్. తాను నటించిన సీతా రామం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాను ప్రభాస్ సినిమాపై మాట్లాడాడు.
తన సినిమా సహా ప్రభాస్ సినిమా నిర్మాతలు ఒకరే కావడంతో తనకి ఆ సినిమా గ్లింప్స్ చూసే అవకాశం వచ్చింది అని దీని కోసం చెప్పాలంటే ఒక అద్భుతంలా ఉందని అలాగే ఖచ్చితంగా ఈ చిత్రం ఇండియన్ సినిమాని మార్చేదిలా ఉంటుంది అని తెలిపాడు.
దీనితో ఈ ఊహించని స్టేట్మెంట్ సినీ వర్గాల్లో సెన్సేషన్ గా మారింది. ఇంకా ఈ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.