ప్రభాస్ హీరోగా తన 21వ చిత్రాన్ని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. వైజయింతీ మూవీస్ పై నాగ్ అశ్విన్ మామ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 100 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నట్లు ఇటీవలే వెల్లడించారు. దీంతో ఇది పాన్ కేటగిరిలో రిలీజ్ అయ్యే సినిమా తేలిపోయింది. తెలుగు, తమిళ్, హిందీ సహా ఇతర భాషల్లో పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది. ప్రభాస్ కున్న పాన్ ఇండియా క్రేజ్ నేపథ్యంలో స్ర్కిప్ట్ యూనివర్శల్ గా ఉంటుందని ఇప్పటికే కథనాలు వేడెక్కించాయి. సోషియా ఫాంటసీ ఫిల్మ్ అని ఇప్పటికే ప్రచారం సాగుతోంది.
తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్ ఇదేనంటూ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. సామాన్య మానవుడికి…స్వర్గ లోకంలో విహరించే దేవకన్యకి పుట్టిన ఓ వండర్ కిడ్ తో నడిచే స్క్రిప్ట్ అని సమాచారం. భూమ్మీద సామాన్య మానవుడు దేవకన్యతో నడిపి ప్రేమ..రొమాన్స్ సహా అటుపై జరిగే పరిణామాలను సినిమాలో ప్రధానంగా హైలైట్ చేసి స్ర్కిప్ట్ సిద్దం చేసినట్లు చెబుతున్నారు. జన్మించిన ఆ బిడ్డ కథ కూడా చాలా ఆసక్తిగా ఉంటుందని లీకులందాయి. మరి ఇందులో నిజం ఎంతన్నది తెలియాల్సి ఉంది.
`బాహుబి ది బిగినింగ్` లో ప్రభాస్ అవంతిక (తమన్నా) రూపంలో ఉన్న దేవకన్య వెంట ఎలా పడతాడో? తెలిసిందే…సినిమాలో ఆ కొద్ది సేపు ఉన్న రొమాంటిక్ సన్నివేశాలు అద్భుతంగా పండాయి. జక్కన్న క్రియేటివీటి నిజంగా వండర్ అనిపించింది. మళ్లీ ప్రభాస్ 21వ సినిమా విషయంలో దేవకన్య అనే మాట వినిపించగానే అభిమానులు మనసులు పుల్లకించిపుతున్నాయి. మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? అన్నది తెలియాలి. ప్రస్తుతం ప్రభాస్ జిల్ దర్శకుడు రాధాకృష్ణతో జాన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.