కరోనా కల్లోలం నేపథ్యంలో ఓటీటీ వేదికలకు అమాంతం ఆదరణ పెరిగింది. జనం ఇండ్ల నుంచి కదలక పోవడంతో బుల్లితెర వీక్షణతో పాటు ఓటీటీ వేదికలపై ఆధారపడడం పెద్ద రేంజులో ఆయా సంస్థలకు కలిసొచ్చింది. థియేటర్లు మూసివేయడం.. టీవీ పరిశ్రమ కంటెంట్ లేకుండా ఉండటంతో వినోద పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లిపోయింది. ఈ లాక్‌డౌన్‌లో జనం విసుగెత్తకుండా OTT వేదికలను అధికంగా ఆశ్రయిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. కరోనా లాక్ డౌన్ వల్ల నెట్‌ఫ్లిక్స్ దేశంలో గరిష్ట చందాదారులను సంపాదించిందని.. ఆ తర్వాతి స్థానంలో హాట్‌స్టార్ నిలిచిందని గణాంకాలు చెబుతున్నాయి. హాట్ స్టార్ తో డిస్నీ విలీనం అవ్వడంతో అది ఆ సంస్థకు పెద్ద రేంజులో సాయమైంది. ఈ రెండిటి తర్వాత అమెజాన్ ప్రైమ్ మూడో స్థానంలో నిలిచింది. దాదాపు అన్ని OTT లు చందాదారులను పొందాయని సర్వేల్లో తేలింది. దేశీ OTT ప్లాట్‌ఫామ్‌లలో జీ 5 ఈ లాక్‌డౌన్ సీజన్ లోనే లాభపడిందని తెలుస్తోంది. తాజా పరిణామంతో ఓటీటీ వేదికలకు మంచి ఊపొచ్చింది. కంటెంట్ తో మరింతగా సబ్ స్క్రైబర్లను పొందడంలో ఇవన్నీ పోటీపడుతున్నాయి. ఇక అల్లు అరవింద్ సైతం ఆహా కంటెంట్ ని పుల్ చేసేందుకు చాలా ప్రణాళికలు రచిస్తున్నారని తెలిసింది.