మమ్మలిని అర్థం చేసుకున్నందుకు థాంక్స్ స‌ర్: అనిల్ రావిపూడి

అనిల్ రావిపూడి. ప్ర‌స్తుతం సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, ర‌ష్మిక హీరోహీరోయిన్లుగా `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమాను రూపొందిస్తున్నాడు. మ‌హేష్ బాబు ఆర్మీ అధికారి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తి బాబును ఎంచుకున్నాడు. అయితే ఇటీవ‌ల ఆ సినిమా నుంచి జ‌గ‌ప‌తిబాబు త‌ప్పుకున్నారు.

ద‌ర్శ‌కుడు అనిల్‌తో విభేదాల వ‌ల్లే సినిమా నుంచి జ‌గ‌ప‌తి బాబు త‌ప్పుకున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో అనిల్ రావిపూడి ట్విట‌ర్ ద్వారా స్పందించాడు. “సరిలేరు నీకెవ్వ‌రు` సినిమాలోని పాత్ర‌ను జ‌గ‌ప‌తిబాబుగారు చాలా ఇష్ట‌ప‌డ్డారు. ఈ ప్రాజెక్టులో భాగం కావాల‌ని ఆయ‌న భావించారు. అయితే కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆయ‌న సినిమా నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. ఆ ప్లేస్ లో ప్రకాశ్ రాజ్ ని తీసుకొన్నారు ప‌రిస్థితిని అర్థం చేసుకున్నందుకు ధ‌న్య‌వాదాలు స‌ర్` అంటూ అనిల్ ట్వీట్ చేశాడు.