నేను హీరో అన్నది వేరు ఇక్కడున్న వారిలో నేను మాత్రమే హీరో అంటే.. మిగతా వారు ఆ స్థాయి వారు కాదనే అర్థం. సరిగ్గా ఇదే అర్థాన్నిచ్చేలా బన్నీ నటించిన తాజా చిత్రం `అల వైకుంఠపురములో` పోస్టర్ వుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అరవింద్‌తో కలిసి ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఆదివారం (12న) సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంక్రాంతి పరుగుపందెంలో బాక్సాఫీస్ వద్ద గట్టిపోటీని ఇవ్వాలని ఫిక్సయి వచ్చిన ఈ చిత్రం తొలి రోజు కొంత డివైడ్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా మంచి స్థాయినే అందుకుంది.
మూడు రోజుల్లో భారీగానే కలెక్షన్‌లని వరల్డ్ వైడ్‌గా కొల్లగొట్టిందని చిత్ర బృందం ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా చిత్ర బృందం రిలీజ్ చేసిన సంక్రాంతి విన్నర్ పోస్టర్ ఆసక్తికరంగా మారింది. తమకు తామే సంక్రాంతి విన్నర్‌గా డిక్లేర్ చేసుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సినిమాకు ముందు రెండు రోజుల తేడాతో రజనీ నంటిచిన `దర్బార్` జనవరి 9న, మహేష్ నటించిన `సరిలేరు నీకెవ్వరు` జనవరి 11న రిలీజ్ అయ్యాయి. ఇప్పటికే రజనీ `దర్బార్` వంద కోట్ల క్లబ్‌లో చేరి తమిళ నాట సంచలనం సృష్టిస్తోంది. మహేష్ `సరిలేరు నీకెవ్వరు` వరల్డ్ వైడ్‌గా 50 కోట్లకు మించి వసూలు చేసి హంగామా చేస్తోంది.
ఈ రెండు చిత్రాలని మించి మేమే భారీ కలెక్షన్‌లు సాధించామని. అందుకని తమ చిత్రమే సంక్రాంతి విన్నర్ అని సెల్ఫ్‌గా `అల వైకుంఠపురములో` మేకర్స్ ప్రకటించుకోవడం మహేష్ ఫ్యాన్స్‌కి ఆగ్రహాన్ని తెప్పిస్తోందట. నేను బ్లాక్ బస్టర్ కొట్టానని చెప్పుకోవడం తప్పులేదు కానీ ఈ సంక్రాంతికి నేను మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్‌ని సాధించానని, కాబట్టి నేనే సంక్రాంతి విన్నర్‌ని అని ప్రకటించుకోవడం ఏమీ బాగాలేదని మహేష్, రజనీ ఫ్యాన్స్ `అల వైకుంఠపురములో` టీమ్‌పై ఫైర్ అవుతున్నారట.