రామ్ చరణ్ – అనిల్.. అనుమానించాల్సిన విషయమే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RRR ఖ్లగ్వ ఆచార్య సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమా ల అనంతరం ఈ స్టార్ హీరో ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనేసి ఆసక్తికరంగా మారింది. దర్శకుల లిస్టు పెద్దగానే ఉంది గాని ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు. ఆఖరికి తమిళ దర్శకులు జూడా చరణ్ డేట్స్ కోసం టార్గెట్ చేసినట్లు టాక్ వస్తోంది.ఇక ఇటీవల హీరో మేనేజర్ ప్రవీణ్ సడన్ గా అనిల్ రావిపూడిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు అనిల్ ప్రస్తుతం F3 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే గాలి సంపత్ సినిమాను దర్శకత్వ పర్యవేక్షకుడిగా ఉన్న అనిల్ షూటింగ్ చేస్తుండగా రామ్ చరణ్ మేనేజర్ అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ డేట్స్ పై కూడా వీరి మధ్య చర్చలు జరిగినట్లు టాక్. దీంతో అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ముందే స్క్రిప్ట్ పై అనిల్, చరణ్ ల మధ్య డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది.

గత ఏడాది నుంచి కూడా రామ్ చరణ్ తదుపరి సినిమాలపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇటీవల మాస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. అలాగే తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఏకంగా హిస్టారికల్ మూవీ చేసే ఛాన్స్ ఉందని అన్నారు. పైగా అందులో KGF యష్ మరో హీరోగా నటించే ఛాన్స్ ఉందని రూమర్స్ వచ్చాయి. మరి రామ్ చరణ్ ఎవరికి ముందు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.