బాక్సాఫీస్ : ఫస్ట్ డే “థాంక్ యూ” కి డిజాస్టరస్ వసూళ్లు..చైతు కెరీర్లోనే తక్కువ.!

Naga Chaitanya Thank You Movie

ఇప్పుడు మన టాలీవుడ్ లో ఎలాంటి పరిస్థితి నెలకొందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ట్రేడ్ వర్గాల వారు బాగా పరిశిలీస్తు ఎందుకు సినిమాలు థియేటర్స్ లో విఫలం అవుతున్నాయో అని తల పట్టుకుంటున్నారు. మరి గత వారం వరకు కూడా వారియర్ రిలీజ్ తో ఏమన్నా మారుతుందేమో అనుకున్నారు.

కానీ ఏమాత్రం మారలేదు. దీనితో ఇక ఈ వారం అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన “థాంక్ యూ” తో ఏమన్నా మారుతుందేమో అని అంతా ఆసక్తిగా చూసారు. కానీ అనూహ్యంగా ఈ సినిమాకే మొదటి రోజు డిజాస్టరస్ ఓపెనింగ్స్ నమోదు కావడం ట్రేడ్ వర్గాలను షాక్ కి గురి చేసింది.

మరి ఈ చిత్రం మొదటి రోజు ఎంత వసూలు చేసింది అంటే ఏపీ తెలంగాణాలో కలిపి కేవలం 1.65 కోట్లు షేర్ మాత్రమే వచ్చిందట. ఇది అసలు నాగ చైతన్య కెరీర్ లోనే అతి తక్కువ ఓపెనింగ్స్ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తాను హీరోగా మల్టీ స్టారర్ లో కాకుండా చేసిన లాస్ట్ సినిమా “లవ్ స్టోరీ” నే 7 కోట్లకి పైగా షేర్ ని రాబట్టింది.

కానీ థాంక్ యూ కి అందులో సగం కూడా రాకపోవడం షాకింగ్ అని చెప్పాలి. ఇక ఈ వారానికి అయితే మరో డిజాస్టర్ నమోదు అయ్యినట్టే అని చెప్పక తప్పదు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కించారు. అలాగే నిర్మాత దిల్ రాజు నిర్మాణం వహించారు.