‘మహానాయకుడు’: టీడీపి బలవంతంగా రుద్ధతోందా..?

ఎన్టీఆర్‌ కథానాయకుడు’ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్స్‌ రాకపోవడం నిరాశను కలిగించింది. అయితే మహానాయకుడు సినిమా ఫలితం భిన్నంగా ఉంటుందని, తప్పకుండా కలెక్షన్స్‌ ను రాబడుతుందని ఆశించారు. కాని మొదటి రోజు నుంచి కలెక్షన్స్‌ పరిస్థితి దారుణంగా ఉంది.

శని, ఆదివారాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. దాంతో బాలయ్య సినీ కెరీర్‌ లోనే ఇదో పెద్ద డిజాస్టర్‌ గా నిలిచింది. ఇది కేవలం బాలయ్యకే కాదు…తెలుగు దేశం పార్టి వాళ్లకు కూడా అవమానంగా మారింది. దాంతో కలెక్షన్స్ పికప్ చేయటం కోసం …పార్టీ ఓ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

దాంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సినిమా అందరూ కచ్చితంగా చూడాలని పార్టీ జనాలకు ఆదేశిస్తున్నారని తెలుస్తోంది. దీంతో బుధవారం నుండి చందాలు వేసుకొని షోలను నడిపిస్తున్నారు. దీంతో పెయిడ్ షోలు పెరిగిపోయాయి.

కొందరు టీడీపీ నేతలు టికెట్లు కొని జనాలకు పంచిపెడుతున్నారని టాక్ . నిన్న జర్నలిస్ట్ లు , వారి కుటుంబాలకు టికెట్లు ఫ్రీగా ఇచ్చారు. అలా రోజుకొక వర్గం వారికి టికెట్లు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుంది.

అయితే ఇక్కడా కొందరు మొహమాటానికి టికెట్లు తీసుకున్నా.. థియేటర్ కి మాత్రం వెళ్లడం లేదట. అంటే ఆ మూడు గంటల సమయం కూడా వృధా అని ఫీలవుతున్నారట. ఇక ఇప్పుడు బలవంతంగా రుద్దే ఈ ప్రయత్నం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!