నిర్మాత కె .ఎస్ రామారావు ఇప్పుడు ఫుల్ హ్యాపీలో వున్నాడు . గత వారం వరకు ఆయన ఎంతో టెన్షన్తో వున్నాడు . కారణం విజయ్ దేవరకొండ నటించిన “టాక్సీవాలా ” సినెమా ఇంటర్నెట్ లో విడుదలైందని . సెన్సార్ టాక్ బాగాలేదని రావడంతో ఆయన చాలా కలవర పడ్డాడు .
ఈనెల 17వ తేదీన “టాక్సీవాలా “సినిమా విడుదలైంది . మొదటి రోజు మాత్రం యావరేజ్ టాక్ వచ్చింది . రామారావు కలవర పడిపోయాడు .ఎందుకంటే రామారావు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవర కొండతో సినిమా మొదలు పెట్టాడు . అంతకు ముందు రామారావు నిర్మించిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్స్ . కనీసం విజయ్ సినిమా అయినా ఆర్ధికంగా నిలబెడుతుంది ఆయన నమ్మాడు . అందుకే రామారావు నిరాశ చెందాడు . అయితే రెండవ రోజు , మూడవ రోజు ఇలా రోజు రోజుకు “టాక్సీవాలా “సినిమా కలెక్షస్ పెరుగుతూ విజయవంతమైన సినిమాగా పేరు రావడంతో రామారావు హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు . విజయ్ దేవరకొండ , రాసి ఖన్నా , మరో ఇద్దరు నాయికల తో ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ మొదటి వారం నుంచి జరుగుతుంది .