రియల్ నాయకుడు అయ్యే వేళ
ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అరవింద సమేత బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఈ కాంబినేషన్ రిపీటవుతోంది అనగానే ఒకటే ఆసక్తి నెలకొంది. రాజమౌళితో RRR పూర్తి కాగానే ఈ కాంబినేషన్ సినిమా సెట్స్ కెళ్లనుంది. అలాగే త్రివిక్రమ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురములో తర్వాత తారక్ తో సినిమా చేయనుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కారణం ఏదైనా.. నందమూరి అభిమానులు ఈ కలయిక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అరవింద సమేత వీర రాఘవ కూడా బ్లాక్ బస్టర్ కాబట్టి అంతకుమించిన సంచలనం సాధ్యమేనని అభిమానుల్లో అంచనాలేర్పడ్డాయి.
తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ నటించనున్న తాజా చిత్రం ఓ పొలిటికల్ డ్రామా కథాంశంతో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇంకా ఈ మూవీకి టైటిల్ ని నిర్ణయించలేదు. తాజాగా ఎన్టీఆర్ లుక్ టెస్ట్ లో పాల్గొన్నారు. తెలుపు ఖద్దర్ దుస్తులలో ఫస్ట్ లుక్ టెస్ట్ కానిచ్చేశారు. కోవిడ్ మార్గదర్శకాల కారణంగా పరిమిత సంఖ్యలో సిబ్బంధితో ఈ టెస్ట్ షూట్ ని పూర్తి చేశారట త్రివిక్రమ్.
తాజాగా తారక్ లుక్ పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. నాయకుడిగా తమ అభిమాన హీరో ఎలా ఉంటాడో చూడాలన్న ఆసక్తి మొదలైంది. ఈ సినిమాని హారిక & హాసిన్ క్రియేషన్స్ బ్యానర్ లో చిన్న బాబు నిర్మిస్తున్నారు.
ట్రెండ్స్ హ్యాండిల్ లేదు
రికార్డ్ కొట్టగలమ అని మన ఫాన్స్ అనుకుంటున్నారు అప్పట్రెండ్స్ లేకపోతే ఏంటి సామి
మిమ్మల్ని 24hrs ముందు ఉండు నడిపించడానికి మన FC లు ఉన్నాయి
తారక రాముడి మీద వున్న అభిమానం తో
కొట్టాలి అన్న కసి తో ట్రెండ్ చేద్దాం#SimhadriTrendOnJuly8th @tarak9999 #RRRMovie pic.twitter.com/55dH4cd4X7— Troll NTR Haters (@TrollNTRHaterzz) June 19, 2020