నా మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తాను. ప్రయోజనాల్ని ఆశించి అబద్ధాలు మాట్లాడటం అస్సలు ఇష్టం ఉండదు’ అని చెప్పింది తాప్సీ. ఇటీవలకాలంలో పరిశ్రమ గురించి ఈ సొగసరి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వీటిపై ఆమె స్పందిస్తూ ‘ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా చిత్రసీమలోకి వచ్చాను. నాకు నచ్చిన సినిమాల్ని ఎంచుకుంటూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నాను. ప్రతి విషయంలో నేను సొంత నిర్ణయాల్నే తీసుకుంటాను. కాబట్టి ఎవరికి సంజాయిషీ ఇచ్చుకునే అవసరం లేదనుకుంటా. ఎవరైనా నాకు నష్టం చేద్దామని ప్రయత్నించినా భయపడను. ఎందుకంటే ఇక్కడ నేను కోల్పోయేది ఏమీ లేదు. సినిమా అవకాశాలు రాని పక్షంలో నాకు ఇష్టమైన మరో రంగాన్ని ఎంచుకొని రాణిస్తా. నాపై నాకున్న నమ్మకం అలాంటిది’ అని ఆత్మవిశ్వాసంతో చెప్పింది తాప్సీ. ప్రస్తుతం ఈ సుందరి హిందీలో ‘మిషన్ మంగళ్’ ‘సాండ్ కీ ఆంఖ్’ చిత్రాల్లో నటిస్తున్నది.