`మా` వివాదం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. రాజశేఖర్ వ్యాఖ్యలను పెద్దలు ఖండిచడం సహా ఆయన్ని ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంలచనమయ్యోయో తెలిసిందే. తదానంతరం రాజశేఖర్ మా పదవికి రాజీనామా చేయడం….రాజీనామాని జనరల్ బాడీ ఆమోదించడం అంతా వేగంగా జరిగిపోయాయి. దీంతో మా ఇప్పుడు స్తబ్దుగా ఉంది. అయితే ఈ వివాదంపై దర్శక, నిర్మాత పుల్లవిరుపు వ్యాఖ్యలు చేయడం టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. వివాదం గురించి మీరేమంటరని ప్రశ్నిస్తే చిరంజీవి చెప్పారుగా! రాజశేఖర్ మాట్లాడింది తప్పు అయితే…చిరంజీవి మాట్లాడింది కూడా తప్పేనని రాజశేఖర్ని వెనకేసుకొచ్చారు.
మీరు జర్నలిస్టులే వివాదం గురించి మీరు విశ్లేషణ చేయోచ్చు…నా విశ్లేషణ మీకెందుకు…అసలు దానికి నాకు సంబంధం ఏంటి? అన్నట్లు స్పందించారు. అయితే తమ్మారెడ్డి గతంలో ఎప్పుడు ఇలా స్పందించలేదు. ఇలాంటి వివాదాలపై తనదైన శైలిలో స్పందించేవారు. తప్పును ఖండించే వారు..ఒప్పును వెనకేసుకొచ్చే వారు. కానీ చిరు-రాజశేఖర్ విషయంలో మాత్రం తమ్మారెడ్డి అసహనంగానే కనిపంచారు. పెద్దలు వాళ్లున్నారు గా..వాళ్లే చూసుకుంటారని తప్పించుకునే ప్రయత్నం చేసారు. వివాదాలు తలెత్తినప్పడు తమ్మారెడ్డి కూడా పెద్దరికం హోదాలో గతంలో ఛాంబర్ తరుపున హాజరైన సందర్భాలున్నాయి.
కానీ మొన్న జరిగిన సమావేశంలో మాత్రం తమ్మారెడ్డి లేరు. ఆయన పేరు కూడా ఏ ఒక్కరూ తలుచుకోలేదు. ఈ నేపథ్యంలో పలు సందేహాలకు తావిస్తోంది. టాలీవుడ్ పెద్దగా తమ్మారెడ్డిని ఆహ్వానించలేదా? లేక ఆహ్వానం అందినా వెళ్లలేదా? అని ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. అందుకే తమ్మారెడ్డి పుల్ల విరుపుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో ముచ్చటించుకుంటున్నారు.