తమిళ లోకి కంచెరపాలం రీమేక్ !

శ్రీ షిరిడీ సాయి మూవీస్‌ పతాకంపై ఎం.రాజశేఖర్‌రెడ్డి, జీవన్‌ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేమంబర్‌ జాస్తీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ తెలుగులో మంచి విజయాన్ని సాధించిన కేరాఫ్‌ కంచరపాలెం చిత్రాన్ని తమిళ నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేసి చేయనున్నామని చెప్పారు. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా తెరకెక్కించాల్సి ఉంటుందన్నారు. కారణం ఇది నిజజీవితంలో జరి గే సంఘటనల ఆధారంగా తయారు చేసిన కథ అని తెలిపారు.

అగస్తీ గారు సంగీతాన్ని అందిస్తుండగా, గుణశేఖరన్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు చెప్పారు. మహా వెంకటేశ్‌ కథా సహకారాన్ని, నీలన్‌ సంభాషణలను, కపిలన్‌ పాటలను రాస్తున్నట్లు చెప్పారు. కాగా తెడియపల్లి మదన్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.