ఈ పోస్టర్ చూస్తే…మనం వెర్రోళ్లమా అనే డౌట్ వస్తుంది

                                                       (సూర్యం)

అవును…ఈ వార్త చదివితే మీరు ఇదే ప్రశ్న అడుగుతారు. మొన్నే కదా..మనం ‘అర్జున్‌ రెడ్డి’ చూసేసి  విజయ్‌ దేవరకొండని ఓవర్‌ నైట్‌ స్టార్‌ని చేసేసాం . తెలుగు సినీ పరిశ్రమలో ఈ సినిమాట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పుడీ సినిమాని తమిళ,హిందీలలో రీమేక్ చేస్తున్నారు. ఓకే…అయితే ఆ తమిళ రీమేక్ ని మళ్లీ తెలుగులోకి డబ్ చేస్తూ తెలుగులో రిలీజ్ చేస్తూండటమే అసలైన న్యూస్.

తమిళంలో ప్రముఖ నటుడు విక్రమ్‌ కుమారుడు ధృవ్‌ ఈ సినిమా రీమేక్‌తో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు ‘వర్మ’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ ఈరోజు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. తెలుగులోనూ ఈ చిత్రం రిలీజ్ చేస్తున్నారని తెలుగు పోస్టర్ ని బట్టి అర్దమైంది.

ఫస్ట్‌లుక్‌లో ధృవ్‌ బైక్‌పై తన ప్రేయసిని ఎక్కించుకుని వెళుతున్నాడు. ఈ సినిమా కోసం ధృవ్‌ ఎక్కువగా గెడ్డం, జుట్టు పెంచేసాడు.  ఈ చిత్రానికి బాలా దర్శకత్వం వహిస్తున్నారు. బాలా సినిమాలకు తెలుగులో ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని ఇక్కడ మళ్లీ వెంటనే రిలీజ్ చేయటం ఎంతవరకూ సబబు అంటారు.

మరోపక్క బాలీవుడ్‌లోనూ ఈ సినిమాను రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో విజయ్‌ దేవరకొండ పాత్రలో బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ నటిస్తున్నారు. హిందీ చిత్రానికి కూడా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కూడా డబ్ చేసి తెలుగులోకి తోసేసినా ఆశ్చర్యం అయితే లేదు.