మళ్లీ మెగాస్టార్ తోనా!?

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌,  మ్యాటినీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై హీరో రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అభ్యుద‌య భావాలున్న ఎండోమెంట్ అధికారిగా మెగాస్టార్ ఈ చిత్రంలో క‌నిపించ‌బోతున్నారు. దాదాపు సగం చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది .రామ్‌చ‌ర‌ణ్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించ‌నున్నసంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రం కోసం మ‌ళ్లీ మిల్క్ బ్యూటీ త‌మ‌న్నాని దించేస్తున్నారని ఇండస్ట్రీలో హాట్ హాట్ గా వినిపిస్తోంది. ఇందులో నిజమెంతుందోనని చిత్రసీమ వర్గాలను కదిలిస్తే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చారిత్రాత్మ‌క చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి` ఈ చిత్రంలో ల‌క్ష్మి పాత్ర‌లో సైరా ప్రియురాలిగా మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా క‌నిపించిన విష‌యం అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక సాంగ్ లో చిరంజీవి కోసం మ‌ళ్లీ మిల్క్ బ్యూటీ త‌మ‌న్నాను దించేస్తున్నారని తెలియగానే ఇండస్ట్రీ టాక్ ఆఫ్ టాలీవుడ్ గా తమన్నా పేరు మారు మోగి పోయింది.

ఈ  చిత్రం కోసం మ‌ణిశ‌ర్మ అయిదు పాట‌ల్నికూడా రెడీ చేశారట.   ఇప్ప‌టికే ఈ పాట‌ల్లో ఒకటి  రెజీనాపై ప్ర‌త్యేక గీతంగా చిత్రీక‌రించారు. మ‌రో స్పెష‌ల్ సాంగ్‌ని త‌మ‌న్నా, చిరుపై చిత్రీక‌రించాల‌ని సన్నాహాలు  చేస్తున్నార‌ట‌. మెగాస్టార్ చిరంజీవి సరసన `ఆచార్య‌`లో నటిస్తున్నందుకు  త‌మ‌న్నాతెగ మురిసిపోతోందిట. ఈ చిత్రం ద్వారా మరోసారి టాలీవుడ్ ని కుదుపేస్తానంటుంది. అల్ ది బెస్ట్ మిల్క్ బ్యూటీ!