‘సైరా’లో కీలక పాత్ర కోసం టబు…ఒప్పించే ప్రయత్నంలో చరణ్!

రామ్ చరణ్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో ‘సైరా నరసింహరెడ్డి’ రూపొందుతుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా చక చకగా షూటింగ్ జరుపుకుంటోంది. చారిత్రక నేపథ్యంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ , నయనతార , సుదీప్ , విజయ్ సేతుపతి కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాలో టబు కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించునున్నట్టుగా  ఒక వార్త వినిపిస్తోంది.

ఇంకా టబుతో సంప్రదాయాలు జరుగుతున్నాయనేది తాజా సమాచారం. చరణ్, సురేందర్ రెడ్డి ఆమెను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. టబు ఓకె అంటే త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు. టబు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ‘పాండురంగడు’ తరువాత ఆమె చేసే సినిమా ఇదే అవుతుంది.