దీపావళి గురించి తాప్సి ఏమన్నదంటే ..!

అటు పుట్టిన ఢిల్లీలోనూ ఇటు నివాసముంటున్న ముంభైలోను దీపావళిని సెలెబ్రేట్ చేసుకుంటుందట తాప్సి . గత సంవత్సరం ముంబైలో ఇల్లు కొనుక్కొని అక్కడే నివాసం ఉంటుంది . తెలుగు, తమిళ సినిమాలో అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం నిర్మాతల గెస్ట్ గా వస్తోంది మిగతా సమయంలో ముంబైలోనే ఉంటుంది . ఆమె చూపంతా ఇప్పుడు హిందీ సినిమాలమీదనే .

ఇక దీవాలి అనగానే ముంబైలో తారలు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటారు . వారం రోజుల ముందుగా  పెద్ద పెద్ద పార్టీలు ఇవ్వడం మొదలు పెడతారు . అయితే ఇలాంటి పార్టీలు చూసి బోర్ కొట్టిందని అందుకే తాను పుట్టి పెరిగిన ఢిల్లీ వెళ్లి పోతున్నానని చెప్పింది .

దీపావళి గురించి చెబుతూ .. తాను స్కూల్ చదువు పూర్తి కాగానే టపాకాయలు కాల్చడం మానేశానని చెప్పింది . టపాకాయలు , బాంబులు పేల్చడం వల్ల పార్యావరణం పాడవుతుందని , అందుకే  సెలెబ్రేషన్స్ మానేశానని  చెప్పింది . ఢిల్లీ వెడితే  కుటుంబ సభ్యులు, స్నేహితురాళ్లతో బాగా గడిచి పోతుందని వారు టపాసులు కాలుస్తుంటే చూస్తానని అన్నది . అందుకే  అక్కడికి వెళ్లి పోతున్నానని చెప్పింది .

ఇక దీపావళి గురించి ఇటీవల సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు  అందరు పాటిస్తే మంచిదని తాప్సి ఓ సలహా ఇచ్చింది .