సైరా డిజిటల్ రైట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్. “సౌతిండియా బెస్ట్ డీల్ ఇదే… అమెజాన్ ఇప్పటివరకూ ఒప్పందం కుదుర్చుకున్న సౌత్ నంబర్ వన్ రేటు ఇదే!“ అంటూ `సైరా` డిజిటల్ రైట్స్ గురించి ప్రచారం సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన `సైరా-నరసింహారెడ్డి` అన్ని భాషల డిజిటల్ రైట్స్ ను కలుపుకుని 40 కోట్ల డీల్ సెట్టయ్యిందన్నది ఆ వార్త సారంశం. అయితే ఇది నిజమా? అంటే కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ దీనిని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది.
సైరా కోసం మెగాస్టార్ చిరంజీవి ట్రాన్స్ ఫర్మేషన్ గొప్ప అనుభవాన్నిచ్చింది. నిర్మాత అయిన తర్వాతనే రియల్ మెగాస్టార్ ఎవరో కలుసుకున్నాను! అంటూ సైరా ఆన్ లొకేషన్ ఉయ్యాలవాడను కలిసినప్పటి ఫోటోని కొణిదెల కంపెనీ ట్విట్టర్ ఇదివరకూ రివీల్ చేసింది. తాజా డీల్ కి సంబంధించిన ఎలాంటి సమాచారం అందలేదు. దక్షిణాది సినిమాల్లోనే ది బెస్ట్ అంటూ ప్రచారం అవుతోంది. సాహోకి దాదాపు 42 కోట్ల మేర చెల్లించిన అమెజాన్ ప్రైమ్ `సైరా`కు అంత పెద్ద మొత్తాన్ని కట్టబెడుతోందా? అన్నది తేలాల్సి ఉంది.