మనస్సులో ఉత్సాహం ఉండాలే కానీ వయస్సు అడ్డం కాదని ప్రూవ్ చేస్తోంది మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్. ఆమె నాలుగు పదుల వయస్సులో చేసిన బెల్లీ డ్యాన్స్ సోషల్‌మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వాళ్లంతా షాక్ అవుతున్నారు. ఈ వయస్సులో అంత చక్కటి శరీరాకృతిని మెయింటైన్ చేయటంమామూలు విషయం కాదు. అలాగే అంత కష్టమైన బెల్లి డాన్స్ చేయటం అసలు ఈజి కాదు.
1999లో తాను నటించిన ‘సిర్ఫ్‌తుమ్’ చిత్రంలోని దిల్బర్ పాటకు సుస్మిత తన జిమ్‌లో డ్యాన్స్ చేసి హాట్ టాపిక్ గా మారింది. చేతులు పైకి పెట్టి నడుము తిప్పుతూ చేసిన డ్యాన్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే..జనం అలా నోరు వెళ్లబెట్టి చూస్తూనే ఉన్నారు.
With all my love!!! #dilbar #reloaded #superfun ????? pic.twitter.com/t2Lt9TdvBL
— sushmita sen (@thesushmitasen) September 8, 2018
అసలు ఈమెకు ఆ ఆలోచన రావటానికి కారణం … రీసెంట్ గా విడుదలైన ‘సత్యమేవ జయతే’ చిత్రంలో ప్రముఖ డ్యాన్సర్ నోరా ఫతేహి ఈ పాట రీమిక్స్ వెర్షన్‌ని చూడటమే. రీమిక్స్ వెర్షన్‌ను దాదాపు 18 కోట్ల మందికిపైగా చూసారు.దాంతో సుస్మిత కూడా ఇదిగో అలా రెచ్చిపోయింది అన్నమాట. ఇప్పటివరకూ ఈ వీడియోను ఎనిమిది లక్షల మందికిపైగా లైక్ చేశారు. లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.