టీజర్ చూస్తూంటే ‘రంగస్దలం’ గుర్తు వస్తోందేంటి?

ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ఎన్జీకే(నంద గోపాల కృష్ణ). ఈ సినిమాలో సూర్య సరసన రకుల్, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు, తమిళ టీజర్లను నేడు చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ చిత్రంలో సూర్య చెవిటి వాడని తెలుస్తోంది. అలాగే రాజకీయాల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తూంటే రామ్ చరణ్ రంగస్దలం గుర్తుకు వస్తోందంటున్నారు అభిమానులు.

NGK (Telugu) - Official Teaser | Suriya, Sai Pallavi, Rakul Preet | Yuvan Shankar Raja | Sri Raghava

‘నాపేరు ఎన్‌జీకే. నంద గోపాల కుమారన్. అందరూ ఎన్‌జీకే అని పిలుస్తారు’ అంటూ సూర్య చెబుతున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. ఇందులో సూర్య చెవిటివాడి పాత్రలో నటిస్తున్నట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. అలాంటిది అతను రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటాడు. ఈ విషయం తెలిసి అందరూ షాకవుతారు.

కానీ కుమారన్‌ భార్య (సాయి పల్లవి) మాత్రం అతనికే మద్దతు తెలుపుతుంది. ‘నీలాంటి వాడు రాజకీయాల్లోకి వస్తే దేశం ఎంత బాగుపడుతుందో ఆలోచించి చూశాను.. ’ అంటూ ఎగతాళి చేసినవారే మళ్లీ గోపాలకు మద్దతు తెలుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే కథ. యువన్‌ శంకర్‌రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.