అతడు అందగాడు చందురూడు అంటూ మగువలు మురిసిపోతుంటారు. ఓ ఛాన్సిస్తేనా అని కుళ్లుకుపోతుంటారు. కానీ అతడు ఎవరికీ చిక్కడు దొరకడు. అయితే అతడి రహస్యాలన్నిటినీ భార్యామణి మాత్రం ఓపెన్ చేసేస్తుంటుంది. అలానే లేటెస్టుగా ఓ వీడియో లీకైంది. ఈ వీడియో నెవ్వర్ బిఫోర్. ఇంతకుముందు ఎప్పుడూ చూడనిది.
ఇంతకీ ఇదంతా ఎవరి గురించో చెప్పాలా? సూపర్ స్టార్ మహేష్ గురించే. తాజాగా మహేష్ జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోల్ని నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోల్లో మహేష్ సింపుల్ గా కార్డియో ఎక్సర్ సైజులు చేస్తున్నారు. అలాగే టీవీ చూస్తూ కాస్త రిలాక్సింగ్ గానే ఆయన కసరత్తులు చేస్తుండడం ఆసక్తికరం. అయితే ఈ శ్రమంతా దేనికోసం? అంటే మహేష్ తదుపరి చిత్రంలో స్మార్ట్ కాలేజ్ బోయ్ గా కనిపించనున్నాడని ప్రచారమవుతోంది. పరశురామ్ దర్శకుడిగా మహేష్ 27 త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ క్రమంలోనే మహేష్ జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ రూపం మార్చుకుంటున్నారు. టీనేజర్ లా తళుక్కుమంటున్న వీడియోలు ఫోటోలు ఇప్పటికే వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.