మ‌హేష్ వ‌ర్సెస్ కిడ్స్.. న‌మ్ర‌త చిట్ చాట్

న‌మ్ర‌తను సోష‌ల్ మీడియా క్వీన్ అనేస్తే త‌ప్పేం కాదు. ఇన్ స్టా స‌హా ప‌లు సామాజిక మాధ్య‌మాల్లో న‌మ్ర‌త ఎంతో స్పీడ్ చూపిస్తుంటారు. తాజాగా తన భర్త ఫిల్మోగ్రఫీ నుండి తనకు బాగా నచ్చిన చిత్రాల్లో ఒక్క‌డు, పోకిరి, మహర్షి, దూకుడు, భారత్ అన్నే నేను,  సరిలేరు నీకెవ్వ‌రు అని తెలిపారు న‌మ్ర‌త‌. మహేష్ గురించి ఇంకా చాలా సంగ‌తుల్నే నమ్రత ఇన్ స్టా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ఇన్ ‌స్టాగ్రామ్ ‌లో `మీ ప్రశ్న అడగండి` కార్య‌క్ర‌మంలో పాల్గొని..ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు.

*మీకు ఇష్టమైన హీరో ఎవరు?

ఇది చాలా కష్టమైన ప్రశ్న (ఫన్నీ ఎమోజిలు). అతను మహేష్ బాబు.

*మీరు ఉత్తమంగా వండే వంటకం?

మాగీ నూడుల్స్

* మీ జీవితంలో మధురమైన క్షణాలు?

ఒక‌టి మహేష్‌ను వివాహం చేసుకోవడం, మరొకటి పిల్లలకు జన్మనివ్వడం.

*మహేష్ సినిమాల క‌థ‌ల్లో మీ ఇన్వాల్వ్ మెంట్?

అస్స‌లు ఉండ‌దు

*మహేష్-పూరి కలయికలో సినిమాలు ఉంటాయా?

టైమ్ డిసైడ్ చేస్తుంది

* మీ ప్రేమను మీ తల్లిదండ్రులు మొదట్లో అంగీకరించారా?

వారు కూడా మొదటి చూపులోనే మహేష్‌తో ప్రేమలో పడ్డారు.

*మొదట ప్రేమను ఎవరు ప్రతిపాదన తెచ్చారు?

చెప్పలేం

*మీకు ఇష్టమైన క్రికెటర్లు ఎవరు?

ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ

*మహేష్‌తో మళ్లీ నటించడానికి ఏదైనా అవకాశం ఉందా?

తెలియదు. వేచి చూడాలి.

*గౌతమ్ మరియు సీతార.. ఎవ‌రు కొంటె కిడ్?

ఇద్ద‌రూ

*సీతార సినిమాల్లోకి అడుగుపెడతారా?

ఇప్పుడే చెప్పేస్తే అది చాలా తొందర అవుతుంది. ప్రస్తుతం ఆమె A & S ఛానెల్‌లో తన వీడియోలతో సంతోషంగా ఉంది.

*మీకు ఇష్టమైన ప్రదేశం ఏమిటి?

స్విస్ ఆల్ప్స్

*మీ అందం, ఆరోగ్యం రహస్యం?

విలాసంగా తినడం, ప్రశాంతంగా నిద్రపోవడం..  రోజూ వ్యాయామం చేయడం

సీతార యూట్యూబ్ ఛానెల్‌లో మీరు ఎప్పుడు అతిథిగా వస్తారు?

సీతార ఎంపిక‌.. ఇంటర్వ్యూ గెస్టుల్ని తెలివిగా సెలెక్ట్ చేసుకుంటుంది.