విజయనిర్మల, కృష్ణ జంటగా నటించిన చిత్రాల లిస్ట్

‘సాక్షి’ చిత్రంతో తొలిసారిగా సూపర్ స్టార్ కృష్ణతో కలిసి విజయ నిర్మల నటించారు. మొత్తం 47 చిత్రాల్లో కృష్ణ-విజయ నిర్మల కలిసి నటించారు. కృష్ణతో వివాహం కాక ముందు నుంచే వీరిద్దరూ పలు సినిమాల్లో కలిసి నటించారు. ఆ సినిమాలన్నీ చాలావరకూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అలా నాలుగు దశాబ్దాల పాటు సినీరంగంలో కృష్ణ-విజయ నిర్మల ప్రస్థానం జోడిగా సాగింది.ఆ చిత్రాల లిస్ట్ ఇక్కడ మీరు చూడవచ్చు.

సాక్షి, మంచి కుటుంబం, సర్కార్ ఎక్స్ ప్రెస్, అత్తగారు కొత్తకోడలు, లవ్ ఇన్ ఆంధ్రా, టక్కరి దొంగ చక్కని చుక్క, విచిత్ర కుటుంబం, బందిపోటు భీమన్న, అక్కా చెల్లెలు, మా నాన్న నిర్దోషి, మళ్లీపెళ్లి, విధివిలాసం, అమ్మకోసం, తాళిబొట్టు, పెళ్లి సంబంధం, పెళ్లికూతురు, పగ సాధిస్తా, అగ్నిపరీక్ష, రెండు కుటుంబాల కథ, అల్లుడే మేనల్లుడు, మాస్టర్ కిలాడి,అనురాధ, మోసగాళ్లకు మోసగాడు, భలే మోసగాడు, పండంటి కాపురం, ప్రజా నాయకుడు, మంచివాళ్లకు మంచివాడు, దేవుడు చేసిన మనుషులు.

మీనా, గాలిపటాలు, అల్లూరి సీతారామరాజు, ధనవంతుడు గుణవంతుడు, దేవదాసు, సంతానం – సౌభాగ్యం, పాడిపంటలు, రామరాజ్యంలో రక్త పాతం, దేవుడే గెలిచాడు, పంచాయితీ, పట్నవాసం, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమాహేమీలు, అంతం కాదిది ఆరంభం, రక్తసంబంధం, సాహసమే నా ఊపిరి, ప్రజల మనిషి,బొబ్బిలి దొర, శ్రావణమాసం చిత్రాల్లో ఇద్దరూ కలిసి నటించారు. కాగా ఈ చిత్రాల్లో కొన్ని పెళ్లి కాక మునుపు.. ఆ తర్వాత కూడా వీరిద్దరూ నటినటీలుగా కొనసాగుతూ టాలీవుడ్‌కు ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలు అందించారు.