ఏం క్రియేటివిటీరా సామీ.. విగ్రహంలోనూ శృంగార భంగిమే

సన్ని లియోన్ ఇప్పుడంటే బాలీవుడ్ హీరోయిన్ కానీ ..గతంలో ఆమె కెరీర్ ప్రారంభం రోజుల్లో ఆమె ఫోర్న్ స్టార్. ఆమె సినిమాల్లోకి వచ్చి హిట్స్ కొట్టినా కూడా ఆమెను ఆ యాంగిల్ లోనే చూస్తూంటారు. ఇదే ఆమె మైనపు విగ్రహంలోనూ ప్రతిబింబించింది. తాజాగా ఏర్పాటు చేసిన ఆ విగ్రహం చూసిన వాళ్లంతా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ విగ్రహం ఎలా ఉంది అంటారా..మా మాటలతో ఎందుకులెండి..ఇదిగో ఇక్కడ చూడండి…

ఇంతకు ముందెప్పుడో దిల్లీలోని మ్యాడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని సన్ని  ప్రకటించింది. ఇప్పుడు స్వయంగా టుస్సాడ్స్లో తన విగ్రహం ప్రక్కనే నిలిచి  ఇచ్చిన ఫోజును అభిమానులకు సోషల్ మీడియాలో  షేర్ చేసింది.

సన్నీ ఈ విగ్రహంలోనూ శృంగార భంగిమ ప్రదర్శించడం జనాలకి షాక్ ఇచ్చింది. ఓ వైపు ఆ శృంగార  ముద్ర తొలిగించుకోవాలనుకుంటున్నట్లలలు మాట్లాడే ఆమె అదే యాంగిల్ ని తన విగ్రహంలో చూపించింది.   అదండీ విషయం.