యస్…దేవరకొండ డేట్స్ దొరక్కే నాతో చేసారు

యంగ్ హీరోల్లో ఎప్పుడూ సోషల్ మీడియాలో ఉంటూ హల్ చల్ చేస్తూండేవాళ్లలో ఒకడు సందీప్ కిషన్. సరదా యాటిట్యూడ్ తో ఫన్నీ కామెట్స్ తో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అవుతూంటాడు. తాజాగా సందీప్ చిత్రం నెక్ట్స్ ఏంటి ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. అయితే ఈ ట్రైలర్ కు రెస్పాన్స్ గా ఒకరు ట్విట్టర్ లో …సందీప్ బదులుగా ఈ పాత్రలో విజయ్ దేవరకొండ చేసి ఉంటే బాగుండేది..న్యాయం జరిగేది అన్నారు.

దానికి సందీప్ కిషన్ వెంటనే కౌంటర్ గా …నిజమే..విజయ్ దేవరకొండ డేట్స్ నిర్మాతలకు దొరక్క నాతో తీసారు అన్నారు. ఇంత స్పోర్టివ్ గా ఒక హీరో రెస్పాండ్ అవుతారని ఎవరూ ఊహించరు కదా. యంగ్ హీరో సందీప్‌ కిషన్‌, తమన్నా కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘నెక్ట్స్‌ ఏంటి’.

ఈ సినిమాకు ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు కునాల్‌ కోహ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ బాలీవుడ్ డైరెక్టర్ తెలుగు సినిమాకి దర్శకత్వం వహించడం ఇదే తొలిసారి. ఇక ఈ చిత్రం టీజర్ ఇప్పటికే రిలిజై క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ట్రైలర్ సైతం మాంచి హాట్ హాట్ డైలాగులతో సాగిపోయింది.

నవదీప్, పూనమ్ కౌర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. లండన్, హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మరోపక్క తమన్నా తెలుగులో ‘దటీజ్‌ మహాలక్ష్మి’ హిందీలో ‘ఖామోషీ’ అనే చిత్రాల్లో నటిస్తున్నారు.