సెక్స్ వల్ల కొట్టుకునే…పచ్చిగా పబ్లిక్ గా చెప్పేసాడు

” సెక్స్ వల్ల కొట్టుకునే ఒక గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్. ఫస్ట్ డ్రింక్ నాతో వెయ్ అని తీసుకెళ్లే ఒక తండ్రి, కూతురును నాతో ఫస్ట్ డ్రింక్ వేయాలని తీసుకెళ్లే తండ్రి… ఇలాంటి మూమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. మీరు ఇప్పటికే చూసిన మూమెంట్సే అయినా ఎంత కొత్తగా తీయొచ్చో కునాల్ ఆయన స్టైల్ లో చెప్పారు. యశ్ రాజ్, ధర్మ ఫిల్మ్స్ స్థాయిలో విజువల్స్ మనీష్ భట్ గారు ఇచ్చార” ని సందీప్ కిషన్ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ‘నెక్ట్స్ ఏంటి?’ ప్రీ రిలీజ్ ఈవెంటులో హీరో సందీప్ కిషన్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గ్లామర్ గాళ్ తమన్నా, యంగ్ హీరో సందీప్ కిషన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నెక్స్ట్‌ఏంటి’?. బాలీవుడ్‌లో ‘ఫనా’, ‘హమ్ తుమ్’లాంటి సూపర్ హిట్ చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు కునాల్ కోహ్లీ ఈ చిత్రానికి దర్శకుడు. తొలిసారి ఓ బాలీవుడ్ డైరెక్టర్ తెలుగు సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

సందీప్ కిషన్ కంటిన్యూ చేస్తూ.. మొదటి రోజు కుర్రాళ్లు ఫ్యామిలీని తీసుకురాకుండా లేకుండా రండి, రెండో రోజు ఫ్యామిలీతో రండి. వచ్చినా టికెట్లు వేరే సీట్లో తీసుకుని కూర్చోపెట్టండి. హానెస్ట్ గా చెబుతున్నాను ఈ సినిమా మేము కష్టపడి తీయలేదు. చాలా సరదాగా తీశాం. ఈ రోజు వరకు ఎంజాయ్ చేస్తూనే పని చేశాం అన్నారు.

నవదీప్, పూనమ్‌కౌర్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్, టీజర్ రిలీజయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదలకానుంది.

ఈ చిత్రం షూటింగ్ అంతా లండన్ లో జరిగింది. అక్కడి లొకేషన్స్, విజువల్స్ ఈ చిత్రంలో హైలైట్ అవ్వనున్నాయి. అక్షయ్ పూరి , రైనా జోషి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక గతకొంత కాలంగా తెలుగులో సరైన హిట్టు లేని సందీప్ కిషన్ ఈ చిత్రం ఎలాగైనా విజయాన్ని అందిస్తుందని ధీమా గా ఉన్నాడు.

లియోన్ జేమ్స్ సంగీతం సమకూరుస్తుండగా, మనీష్‌చంద్ర భట్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. రైనా జోషి, అక్షయ్‌పూరి నిర్మిస్తున్నారు. తమన్నా భాటియా, సందీప్ కిషన్, నవదీప్, శరత్‌బాబు, పూనమ్‌కౌర్, లారిస్సా తదితరులు నటిస్తున్నారు.