సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుమంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సుబ్రమణ్యపురం’. ఆధ్యాత్మిక అంశాలతో కూడిన వైవిధ్యమైన కథాంశంతో రుపొందిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది. ఈ సినిమాలో సుమంత్ సరసన ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటిస్తోంది. దేవుడినే ఎదిరించే వ్యక్తిగా సుమంత్ అలరించబోతున్నాడని ఇప్పటికే ప్రచారం జరిగింది. రిలీజైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఉత్కంఠకు తెరలేపింది. అయితే సినిమాలో అంత సీన్ లేదని తేలిపోయింది.
కథలో సుబ్రమణ్య పురం అనే గ్రామంలో ..వరసపెట్టి ఆత్మహత్యలు జరుగుతూంటాయి. అయితే ఎందుకు జరుగుతున్నాయనే విషయమై చిన్న క్లూ కూడా దొరకదు. మరో ప్రక్క హేతువాది కార్తీక్ ( సుమంత్ )..పురాతన దేవాలయాల మీద రీసెర్చ్ చేస్తూంటాడు. అతనికి ఈ విషయం తెలిసి ఆ ఊరు బయిలుదేరతాడు. అది సైన్సో లేక దేవుని మహత్యమో తేల్చాలనుకుంటాడు. అక్కడకి వెళ్లి కారణాలు అన్వేషిస్తాడు. అనుమానస్పదమైన సంఘటనలు మరిన్ని జరుగుతాయి. ఫైనల్ గా ఈ ఆత్మహత్యలు వెనక ఉన్న కారణాన్ని , వ్యక్తిని కనుక్కుంటాడు. ఎవరు అనేది ఈ కథలో కీలకాంశం.
ఈ చిత్రం ఫస్టాఫ్ ..చాలా బోర్ గా సాగుతూ..ప్రేక్షకుడు ఊహించినట్లే జరుగటం విసిగించింది. కాసేపు పల్లె,కాసేపు సిటీ మధ్య కథ నడిచింది. పల్లెలో జరిగే ఆత్మహత్యలు ఏ విధమైన మిస్టిరి ఫీల్ ని తీసుకురాలేకపోయాయి. అలాగే ఇలాంటి సినిమాలకు ప్రాణంగా ఉండాల్సిన రీరికార్డింగ్ సైతం నార్మల్ గా ఉంది.
ఫస్టాఫ్ లాగానే సెకండాఫ్ కూడా ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా సాగింది. నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ లోంచి కొన్ని ఎలిమెంట్స్ ని, చిరంజీవి అంజిలోంచి కొన్ని అంశాలను తీసుకుని కథను తయారు చేసారని అర్దమవుతోంది. సినిమా కాస్టింగ్ కూడా దారుణంగా ఉంది. దాదాపు అందరూ ఫేడ్ అవుట్ అయిన ఆర్టిస్ట్ లే సినిమా మొత్తం కనిపిస్తారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా గొప్పగా లేవు. ఓవరాల్ గా ఇది సి సెంటర్లలో ఏమన్నా ఆడాలేమో కానీ ఎ,బి, మల్టిఫ్లెక్స్ లలో కష్టం.