బూతు హీరోకు సపోర్ట్ గా నిలిచిన డైరక్టర్ సుకుమార్

విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించిన ఫ‌ల‌క్‌నామా దాస్‌ ఇటీవ‌లే విడుద‌లైంది. ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా నిర్వ‌హించిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో విశ్వ‌క్‌సేన్ రెచ్చిపోయి మాట్లాడాడు. . ఫేస్ బుక్ లైవ్‌లో బూతులు కూడా మాట్లాడ‌డం మొద‌లెట్టాడు. ఇన్‌స్ట్రాగ్రామ్ లో బాక్సాఫీసుని ఉద్దేశించి ఓ బూతు మాట వాడేశాడు. సినిమా బాగోలేదంటే నాకు సుర్రుమ‌ని కోపం వ‌చ్చింది అలా మాట్లాడా అని కవర్ చేసుకోబోయాడు. అయితే విశ్వ‌క్ సేన్ తీసుకొస్తున్న నెగిటీవ్ ప‌బ్లిసిటీ ఈ సినిమాకి బాగానే హెల్ప్ అవుతోంది.

తాజాగా ఈ సినిమాకి సుకుమార్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సుకుమార్ ఈ సినిమా చూశాడ‌ట‌. త‌న‌కు బాగా న‌చ్చింద‌ని, హైద‌రాబాద్ సంస్క్కృతిని కొత్త‌గా చూపించార‌ని కితాబులు ఇచ్చేశాడు. హైద‌రాబాద్ సంస్క్కృతి వింత‌గా, కొత్త‌గా ఉంటుంద‌ని, దాన్ని జ‌గ‌డంలో చూపించ‌డానికి ప్ర‌య‌త్నించాన‌ని, కానీ కుద‌ర్లేద‌ని – ఈ సినిమాలో మాత్రం అది బాగా క‌నిపించింద‌ని ప్ర‌శంసించాడు.

ద‌ర్శ‌కుడిగా ఇదే తొలి ప్ర‌య‌త్నం అయినా విశ్వ‌క్ బాగా చేశాడ‌ని, కొత్త‌వాళ్ల‌తో అనుకున్న అవుట్‌పుట్ రాబ‌ట్టుకున్నాడ‌ని, చిన్న‌పిల్ల‌ల‌తో చెప్పించిన సంభాష‌ణ‌లు కూడా బాగున్నాయ‌ని, సినిమా మొత్తం స‌హ‌జంగా ఉంద‌ని ఈ టీమ్‌ని మెచ్చుకున్నాడు సుకుమార్‌.