సాయి ధరమ్ తేజ కోసం  సీన్ లోకి సుకుమార్

గత కొంతకాలంగా సాయి ధరమ్ తేజ కు హిట్ అనేది లేకుండా పోయింది. వరస పెట్టి నమ్మి చేసిన ప్రాజెక్టులన్నీ గోదావరిలో కలిసిపోయాయి. ఏ సినిమా చేస్తే హిట్ కొడతాం , ఏ డైరక్టర్ తో ముందుకు వెళ్లాలి అనేది సాయి కి ఓ పెద్ద క్వచ్చిన్ మార్క్ గా మారిపోయింది.

ఈ నేపధ్యంలో సాయి ధరమ్ తేజ ..దర్శకుడు సుకుమార్ ని పట్టుకున్నట్లు  సమాచారం. అయితే తాను ఇప్పుడు ఉన్న పరిస్దితుల్లో  సాయి ని డైరక్షన్ చేసే సిట్యువేషన్ లో లేనని, అయితే కథ ఇచ్చి ప్రొడ్యూస్ చేసి హిట్ ఇస్తానని చెప్పినట్లు సమాచారం.

దాంతో సుకుమార్ రాసిన ఓ కథని సాయి కు వినిపించటం జరిగింది. దర్శకుడుగా భం బోలేనాధ్ అనే ఫ్లాఫ్ సినిమాని డైరక్ట్ చేసిన కార్తీక్ వర్మని పిలిచి ప్రాజెక్టు అప్పచెప్తున్నట్లు చెప్తున్నారు. కుమారి 21 ఎఫ్ మాదిరిగా ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని సాయి ధరమ్ తేజ చాలా ఆశలు పెట్టుకుని వేరే దర్శకులందిరనీ ప్రక్కన పెట్టేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంభంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాసం ఉంది.